‘ఇది వైసీపీ ప్లీనరీ! టీడీపీ మహానాడు వంటావార్పులా కాదు’

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ..

గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ.. టీడీపీ సర్కారుపై ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పారు.

ప్రజల పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతగా ఉంటుందని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తమ పార్టీ ఎంత కృతనిశ్చయంతో పని చేస్తోందో ఈ ప్లీనరీలో చెప్పడం జరుగుతుందని భూమని తెలిపారు. దాదాపు 18 కీలక అంశాలపై ప్లీనరీలో చర్చిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ చేస్తున్న ద్రోహాన్ని.. ప్రజల తరపున నిలబడి పోరాడటమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు.

bhumana karunakar reddy in YSRCP plenary

ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం తమ పార్టీ స్థాపించబడిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని అన్నారు. వీటన్నింటిపై గత మూడేళ్లుగా తమ పార్టీ పోరాటం చేస్తోందని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ఏ విధంగా ముందుకెళ్లాలనేదానిపై ఈ ప్లీనరీ సమావేశాల్లో కార్యకర్తలకు దశ, దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+