బాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా, కేసీఆర్ అంటే భయం: భూమన

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏమన్నారో తెలుసా.. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని ఎన్టీఆర్ చెప్పారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం నాడు మండిపడ్డారు.

ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆయన మీడియాకు చూపించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చంద్రబాబు రాజకీయంపై తమ పార్టీ అధినేత జగన్ యుద్ధం చేస్తున్నారన్నారు. ప్రజల బాధ జగన్ గొంతులో వినిపిస్తోందని చెప్పారు.

bumana

చంద్రబాబు పైన వచ్చినన్ని ఆరోపణలు మరే రాజకీయ నాయకుడి పైన రాలేదన్నారు. జగన్ పైన బాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. నిధులు పొంగిపొర్లే పథకం పట్టిసీమ అని, అందుకనే, జగన్ ఆ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. హామీలను నెరవేర్చమంటే అభివృద్ధిని అడ్డుకోవడమా? అని ప్రశ్నించారు.

పాత సినిమాల్లో భేతాళ మాంత్రికులకు ఏమాత్రం తీసిపోనివారు, రాజకీయ తంత్ర విద్యలన్నింటిని దగ్గర పెట్టుకున్నారంటూ టిడిపి నేతల పైన విమర్సలు గుప్పించారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి జగన్ మీద టీడీపీ నేతలు యుద్ధం ప్రకటిస్తున్నారన్నారు.

హైదరాబాద్ నుంచి ఏపీ పరిపాలన కొనసాగిస్తే ఊరుకోమన్న కేసీఆర్ బెదిరింపులకు చంద్రబాబు భయపడ్డారని, అందుకే ఉద్యోగులను బలవంతంగా అమరావతికి తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో గట్టి ప్రతిపక్షం ఏర్పడితే దానిని చీల్చి ఒక్కొక్కరికీ రూ.30 కోట్లు, రూ.40 కోట్లు ఇచ్చి జగన్ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.

జగన్ పైన యరపతినేని ఆగ్రహం

వైయస్ జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. జగన్ తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. జగన్‌కు ప్రజలే చెప్పులతో బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు.

జగన్ ఎందుకంతగా సంయమనం కోల్పోతున్నారో తనకు అర్ధం కావడం లేదని టిడిపి నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన వాడిన భాషను చూశాక తెలుగు భాషకు ఇది దుర్దినమని చెప్పవచ్చన్నారు.

సంయమనంతో వేచి చూడాలని, రాజకీయాల్లో దుష్టసంప్రదాయాలు మంచివి కాదన్నారు. ప్రత్యర్ధులను విమర్శించేటప్పుడు భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికైనా జగన్ వైఖరిలో మార్పు రావాలని ఆయన హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+