క్యాబ్ డ్రైవర్ రేప్‌యత్నం: గర్ల్ స్నానం చేస్తుంటే లోనికెళ్లి..

Bid to rape RGIA staff
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో విధులు ముగించికొని ఇంటికి వచ్చేందుకు క్యాబ్ ఎక్కిన ఓ ప్రయివేటు కంపెనీ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోలీసు స్టేషన్ పరధిలో శుక్రవారం రాత్రి జరిగింది.

వివాహితపై గుర్తు తెలియని క్యాబ్ డ్రైవర్ ఆత్యాచార యత్నం చేసినట్టు శనివారం సిఐ దుర్గ ప్రసాద్ తెలిపారు. సాతంరాయికి చెందిన ఓ వివాహిత ఎయిర్ పోర్టులో హౌస్ కీపింగ్ జాబ్ చేస్తోంది. శుక్రవారం రాత్రి 9.10 సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఎయిర్ పోర్టులో గుర్తు తెలియని క్యాబ్ ఎక్కింది.

హైదరాబాద్ వెళ్లాల్సిన కారు షాద్‌గనర్ వైపు వెళ్లడంతో ఆమె డ్రైవర్‌ను నిలదీసింది. పెట్రోల్ కోసం అని డ్రైవర్ సమాధానమివ్వడంతో అనుమానంతో ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసింది. ఆమె కేకలు వేసింది. వెంటనే జిఎంఆర్ హెల్ప్ డెస్క్‌కు ఫోన్ చేసి సాయం కోరింది.

వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు కారును ఆపమని, తనను వదిలిపెట్టమని ఆమె కేకలు వేసింది. భయపడిన క్యాబ్ డ్రైవర్ బుర్జుగడ్డ తండా పివన్ రోడ్డుపై దించేసి పారిపోయాడు.

అంతలో అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కారులో మరో వ్యక్తి ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కిడ్నాప్, అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేశారు.

స్నానాల గదిలోనికెళ్లి...

మరోవైపు స్నానం చేస్తున్న బాలికను బెదిరించి ఓ యువకుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదన్నపేట నెహ్రూలాల్ నగర్‌లోని ఓ ఇంట్లో తల్లి, కూతుళ్లు అద్దెకు ఉంటున్నారు. జులాయిగా తిరిగే ఇంటి యజమాని కొడుకు ఈ నెల 23న ఆ ఇంట్లో ఉండే బాలిక స్నానం చేసేందుకు వెళ్లగా స్నానాల గదిలోకి ప్రవేశించాడు. బాలిక అరిచే యత్నం చేయగా నోరుమూసి బెదిరించి అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయాన్ని మాదన్నపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+