తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్లు మార్పు.. ఎక్కడంటే..?
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో భక్తులు భారీగా శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకుంటున్నారు. దీంతో గత వారం రోజుల నుంచి సాధారణం కంటే ఎక్కువ రద్దీ చోటు చేసుకుంటోంది. ఇవాళ 29 కంపార్టుమెంట్స్ లో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది టీటీడీ బోర్డు. దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్లు మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
గత వారంరోజులుగా తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్. శ్రీవారి మెట్టు మార్గంలోని దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు మారాయి. టీటీడీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్లను అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లోకి మార్చనున్నారు.
శుక్రవారం నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్దే దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. అయితే ఇది తాత్కాలిక మార్పు మాత్రమేనని టీటీడీ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేసింది. ఇదే విషయంపై టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష జరిపి భక్తులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.

ఈ మార్పు శుక్రవారం సాయంత్రం నుంచి అమల్లోకి రానున్నట్లు టీటీడీ బోర్డు పేర్కొంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ పద్దతిలో ముందుగా వచ్చిన వారికి ముందు దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టనుంది టీటీడీ. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి దివ్య దర్శనం టోకెన్లు పొందాలి. ఆ తర్వాత టోకెన్లను శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.












Click it and Unblock the Notifications