వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నూజివీడు ఎన్నికల బరిలో బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్ సంజన ..బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే

|
Google Oneindia TeluguNews

బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్ లు రాజకీయాలపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఎన్నికల ముందు టీడీపీ లో చేరాలని చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇక బిగ్ బాస్ 2 లో మొదటి వారమే సంచలనం సృష్టించి హౌజ్ లో ముందుకు వెళ్ళకుండానే వెనుదిరిగిన సంజన ఇక ఏకంగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగి నూజివీడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు . ఎవ్వరూ ఊహించని పెద్ద షాక్ ఇచ్చారు బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్ సంజన.

 రాజకీయాల్లో ఫేమస్ అవ్వాలని పోటీ

రాజకీయాల్లో ఫేమస్ అవ్వాలని పోటీ

కామన్ మెన్ కేటగిరిలో బిగ్ బాస్ 2 లో అడుగుపెట్టింది సంజన. మిస్ హైదరాబాద్ టైటిల్ విన్నర్ అయిన సంజన.. అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. అయితే.. వాటిల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా.. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అవుదామని ప్రయత్నించింది. అయితే.. అక్కడ కూడా బెడసి కొట్టింది. మొదటి వారంలోనే ఆమె బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది .కాగా ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది సంజన . రాజకీయాల ద్వారా ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తోంది.

స్వతంత్ర అభ్యర్థిగా సంజన ..

స్వతంత్ర అభ్యర్థిగా సంజన ..

నేనేరాజు నేనేమంత్రి, బిగ్‌బాస్‌-2లో పాల్గొన్న సాయి సంజన నూజివీడు అసెంబ్లీకి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని సంజనా నూజివీడు అసెంబ్లీ బరి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ కూడా వేశారు.

 దివంగత మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు సమీప బంధువు

దివంగత మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు సమీప బంధువు

ఇక ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే సంజన దివంగత మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు సమీప బంధువు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన సాయిసంజన అసలు పేరు అన్నే వనజ. ఆమె తండ్రి అన్నే ధనకోటేశ్వరరావు ప్రముఖ రైతు. మొదటి నుండి రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆమె చాలా రకాలుగా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేశారు.

 కాంగ్రెస్ నుండి టికెట్ కోసం యత్నం ఫలించకనే .. ఇలా

కాంగ్రెస్ నుండి టికెట్ కోసం యత్నం ఫలించకనే .. ఇలా

వ్యవసాయం జీవనాధారంగా ఉన్న రైతు కుటుంబంలో పుట్టిన సంజన @ అన్నే వనజ 2016లో మిస్‌ హైదరాబాద్‌గా ఎంపికయ్యారు. ఆమె హైదరాబాద్‌ సినీపరిశ్రమకు వెళ్లాక జనజాగృతి పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నూజివీడు అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రయత్నించారు. టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీ బరిలో పోటీచేస్తున్నారు.

English summary
big boss 2 Contestant Sanjana will compete in the Nuzvidu constituency in the AP election. The nomination was also a filed in the elections as an independent candidate. Sanjana, who tried to get a ticket from Congress and eventually contested as an Independent candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X