వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరసరావుపేట లోక్‌స‌భ నియోజకవర్గం కోసం చంద్ర‌బాబును క‌లిసి బడా వ్యాపార‌వేత్త‌?

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీచేసేందుకు ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త ఒక‌రు చంద్ర‌బాబును క‌లిశారు. ఇదే లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే అయిన రాజ‌కీయ‌నేత ఒక‌రు ఆయ‌న్ను చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లారు. బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన స‌ద‌రు వ్యాపార‌వేత్త‌ హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, పుణె వంటి న‌గ‌రాల్లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

తటస్తుల పేరుతో కేటాయించామని...

తటస్తుల పేరుతో కేటాయించామని...


ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఆ వ్యాపార‌వేత్త ముందుగానే న‌ర‌స‌రావుపేట ప‌రిధిలో పోటీచేస్తే ఎలా ఉంటుంద‌నే విష‌య‌మై స‌ర్వే నిర్వ‌హింప‌చేసుకున్నారు. ఆ త‌ర్వాత త‌న‌కు స‌న్నిహితుడైన మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడి అధినేత‌ను క‌లిశారు. రానున్న ఎన్నిక‌ల్లో త‌ట‌స్తుల కోటాలో అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టీడీపీ త‌ర‌ఫున ఎంపీగా విజ‌యం సాధించారు. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం వ‌యోభారం కార‌ణంగా క్రియాశీల రాజ‌కీయాల‌కు రాయపాటి దూరంగా ఉన్నారు. దీంతో స‌ద‌రు వ్యాపార‌వేత్త‌కు సీటు ల‌భించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో తటస్తులతో పేరుతో ప్రయోగం జరిపిన తెలుగుదేశం సఫలీకృతం కావ‌డంతో మ‌రోసారి ఆ దిశగా యోచన జరిపే అవకాశాలున్నాయ‌ని పార్టీవ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇప్పటినుంచే ప్రయత్నాలు..??

ఇప్పటినుంచే ప్రయత్నాలు..??


న‌ర‌స‌రావుపేట లోక్‌స‌భ నుంచి పోటీచేస్తే విజయావకాశాలు ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌లువురు ప్ర‌ముఖులు ఈ సీటు కోసం ఇప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దీని ప‌రిధిలో న‌ర‌స‌రావుపేట‌, వినుకొండ‌, మాచ‌ర్ల‌, చిల‌క‌లూరిపేట‌, గుర‌జాల‌, స‌త్తెన‌ప‌ల్లి, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా ఉన్నామ‌ని భావిస్తున్న టీడీపీ కేంద్ర నాయ‌క‌త్వం ఈసారి ఎలాగైనా ప‌సుపు జెండాను రెప‌రెప‌లాడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందుకు అంగబలం, ఆర్థిక బలం ఉన్న వ్యక్తికోసం అన్వేషిస్తున్న సమయంలో ఆ వ్యాపారవేత్త బాబును కలిశారు.

తనకేననే ధీమాతో..

తనకేననే ధీమాతో..


చంద్రబాబుతో సమావేశ‌మైన త‌ర్వాత న‌ర‌స‌రావుపేట స్థానం త‌న‌కే ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కాన్ని ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రికి కేటాయించాల‌నే విష‌య‌మై ఇంకా స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికీ ఆ వ్యాపార‌వేత్త బీసీ కావ‌డం, అందులోను వ‌డ్డెర సామాజిక‌వ‌ర్గానికి చెంద‌డం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండటం, వారికి సభలో ప్రాతినిథ్యం లేకపోవడం లాంటివన్నీ తనకు కలిసివస్తాయని ఆయన భావిస్తున్నారు. ఆ వ్యాపారవేత్తను తీసుకువెళ్లిన ఎమ్మెల్యేకు చంద్రబాబు దగ్గర మంచిపేరు ఉండటంతో ఆ మార్గంలో కూడా తనకు సీటు లభించే అవకాశం ఉందనే నమ్మకంతో ఆ బిజినెస్ మేన్ ఉన్నారు.

English summary
big businessman meet with telugu desam chief Chandrababu for NarasaRaopet Lok Sabha constituency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X