Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోటంరెడ్డిని వైసీపీ నిలువరిస్తుందా - సీన్ ఛేంజ్, కలిసొచ్చేదెవరికి..!!

ఏపీలో ఎన్నికల వేళ ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. సీఎం జగన్ - చంద్రబాబు గెలుపు కోసం వ్యూహాలతో సిద్దమవుతున్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. కానీ, ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతలు పార్టీని వీడి టీడీపీకి దగ్గరయ్యారు. ఇక్కడ పార్టీని వీడిన తొలి నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ లో టీడీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడ గెలుపు కోసం జగన్ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

హోరా హోరీ : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. జిల్లాలో పార్టీ నాయకత్వాన్ని విభేదించిన కోటంరెడ్డి టీడీపీలో సీటు ఖాయం చేసుకున్నారు. దీంతో..అక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నెల్లూరు రూరల్ నుంచి ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయించారు. ఆదాల ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే, తాజాగా ఎంపీ అభ్యర్దిగా ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడారు. ఆయన స్థానంలో ఎంపీగా పీటీ చేసే అభ్యర్ది కోసం జగన్ కసరత్తు చేస్తున్నారు.

Big Fight between YSRCP Rebel Kotamreddy and MP Adala in Nellore Rural Assembly

వైసీపీ కొత్త ప్లాన్ : ఆదాలను తిరిగి ఎంపీగా పోటీ చేయించే అంశం పైనా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నెల్లూరు రూరల్ నుంచి మాలెం సుధీర్ కుమార్ రెడ్డిని పోటీకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ అభ్యర్ది పైన నిర్ణయం తీసుకున్న తరువాత రూరల్ లో అభ్యర్ది పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రూరల్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వైసీపీ ఉండటంతో ఆదాలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే నియోజకవర్గంలో 2019లో కోటంరెడ్డి వైసీపీ అభ్యర్దిగా టీడీపీ అభ్యర్ది అజీజ్ పైన 22,776 ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు వేమిరెడ్డి సైతం టీడీపీలో వస్తున్నారనే ప్రచారంతో మరింత బలం పెరుగుతుందని కోటంరెడ్డి అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Big Fight between YSRCP Rebel Kotamreddy and MP Adala in Nellore Rural Assembly

గెలుపెవరిది : నెల్లూరు జిల్లాలో 2019లో వైసీపీ అన్ని సీట్లను సొంతం చేసుకుంది. ఎంపీ స్థానం వరుసగా 2012, 20214, 2019లోనూ గెలుచుకుంది. ఈ సారి జిల్లాలో మారిన సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకోవాల ని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు కోటంరెడ్డి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో తనకు తొలి నుంచి ఉన్న పరిచయాలతో ఎన్నికల ఫలితం తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆదాల తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. ఇప్పుడు వైసీపీలో అభ్యర్ది కొనసాగింపు లేదా మార్పు పైన నిర్ణయం వచ్చిన తరువాత నెల్లూరు రూరల్ లో రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది మాత్రం రాష్ట్రంలో ఆసక్తిని పెంచే అంశంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+