ఉండవల్లిలో వైసీపీ నేతల పై కోడిగుడ్లతో దాడి, రాళ్ల దాడిలో కార్లు ధ్వంసం..!!
వైసీపీ నేతల పై దాడి జరిగింది. కోడిగుడ్లు.. రాళ్లతో దాడులు చేసారు. అమరావతి పరిధిలోని ఉండవల్లిలో రాజధాని భూముల పరిశీలనకు వెళ్లిన వైసీపీ సీఆర్డీఏ పరిరక్షణ సమితి నేతల పైన దాడి జరిగింది. వైసీపీ నేతలను అడ్డుకొని..కోడిగుడ్లతో దాడి చేసారు. అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరువాతనే రావాలని నినదించారు. రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్సీల కార్లు ధ్వంసం అయ్యాయి. పోలీసులకు గాయాలయినట్లు తెలుస్తోంది. అక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
అమరావతిలోని తాడేపల్లి లో వైసీపీ సీఆర్డీఏ పరిరక్షణ టీం నేతలు భూముల పరిశీలనకు వెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లి రైతులు మాజీ సీఎం జగన్ ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. దీంతో, సీఆర్డీఏ పరిరక్షణ బృందం ఏర్పాటు చేసిన జగన్.. అక్కడ క్షేత్ర స్థాయి పరిస్థితుల పూన అధ్యయనం చేయాలని సూచించారు. అందులో భాగంగా తాడేపల్లికి వెళ్లిన సీఆర్డీఏ పరిరక్షణ బృందం ను స్థానికంగా అడ్డుకున్నారు. దీంతో.. ఒక్కసారిగా ఉండవల్లి సెంటర్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ నేతలపై కోడిగుడ్లు విసిరారు. . లేళ్ల అప్పిరెడ్డి తో పాటుగా అరుణ్ కారు ధ్వంసం చేసారు. CRDA పరిరక్షణ కమిటీ సభ్యులు, పోలీసులపై రాళ్లు రువ్వింది టీడీపీ శ్రేణులే అంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు.

వైసీపీ కమిటీలో దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని సభ్యులుగా ఉన్న ఈ బృందానికి రాజధాని రైతుల నుంచి నిరసన ఎదురైంది. కుట్రలకు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నల్లజెండాలతో రోడ్లమీదకు వచ్చిన రైతులు, మహిళలు కూటమి నేతలు. డౌన్ డౌన్ మావిగన్ అంటూ నినదించారు. వైసీపీ నేతలని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసారు. వైసిపి నేతల బృందానికి నిరసనగా నల్ల జెండాలతో భారీగా తరలిరావాలని రాజధాని రైతుల పిలుపు ఇచ్చారు. కాగా.. ఒక్క సారిగా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు మొహరించారు. దీంతో, వైసీపీ శ్రేణులు అక్కడే ధర్నాకు దిగారు. అందరినీ పంపించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.














Click it and Unblock the Notifications