జగన్ దంపతులకు భారీ ఊరట: అనుకూలంగా తీర్పు

ఆస్తి పంపకాల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువడించింది. జగన్ దంపతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ కు చెందిన షేర్ల వ్యవహారంలో జగన్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన గత ఏడాది సెప్టెంబర్ లో ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. షేర్ల బదిలీ అక్రమమని వాదించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా క్లాట్ లో పిటీషన్ దాఖలు చేశారు.

Big releaf for YS Jagan

క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగన్, ఆయన భార్య వైఎస్ భారతి ఈ పిటీషన్ వేశారు. ఈ కేసులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, సరస్వతి పవర్ సౌత్- ఈస్ట్ రీజియన్ జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు.

కంపెనీల యాక్ట్ 59 కింద వైఎస్ జగన్ తరఫున వై సూర్యనారాయణ సెప్టెంబర్ 10వ తేదీన ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీన్ని క్లాట్.. విచారణకు స్వీకరించింది. కంపెనీ యాక్ట్ క్లాజ్ 59 ప్రకారం- సరైన కారణాలు లేకుండా ఒక కంపెనీ రిజిస్టర్‌లో ఒకరి పేరును నమోదు చేయడం లేదా తొలగించితే.. దాన్ని సరిదిద్దాలని కోరుతూ బాధిత పక్షం క్లాట్‌లో అప్పీల్‌ చేసుకోవచ్చు.

ఈ క్లాజ్ కిందే వైఎస్ జగన్, వైఎస్ భారతి క్లాట్‌లో పిటీషన్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ పురోగతి సాధించడానికి తాము కీలక పాత్ర వహించామని జగన్, భారతి తమ పిటీషన్‌‌లో పొందుపరిచారు. ఈ కంపెనీలో ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో షర్మిలకు వాటాలు ఇవ్వడానికి అంగీకరించారు.

ఈ మేరకు 2019 ఆగస్టు 21వ తేదీన ఒక అవగాహన ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నారు. సరస్వతి పవర్స్‌ ద్వారా షర్మిలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, అందులో వాటా ఇవ్వడానికి ఉద్దేశించిన ఒప్పందాలపై జగన్, భారతి సంతకం చేశారు. ఈ వాటాల కేటాయింపు ఇంకా ఖరారు కాలేదు.

ఈ కేసులో క్లాట్.. కొద్దిరోజుల కిందటే వాదనలను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కొద్దిసేపటి కిందటే తుది తీర్పు వినిపించింది క్లాట్. వైఎస్ జగన్- భారతిలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. షేర్ల బదిలీని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. షేర్ల బదిలీ అక్రమమని పిటీషన్ దాఖలు చేసిన జగన్ తరఫు న్యాయవాది వాదనలతో క్లాట్ ఏకీభవించింది. నిలిపివేయాలని తుది తీర్పు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+