Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఊరట - గవర్నర్ కోర్టులో బంతి.. జగన్ సర్కార్ కిం కర్తవ్యం ?

తనను ఎన్నికల కమిషనర్ గా పునర్ నియమించాలని కోరుతూ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇవాళ భారీ ఊరట లభించింది. తమ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు ఏపీ సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో గవర్నర్ ను కలిసి తనను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని కోరాలని హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించింది. దీంతో గవర్నర్ కోర్టులోకి బంతి వెళ్లినట్లయింది.

 జగన్ కు షాక్- నిమ్మగడ్డకు ఊరట...

జగన్ కు షాక్- నిమ్మగడ్డకు ఊరట...

గతంలో తమకు వ్యతిరేకంగా స్ధానిక ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషన్లో సంస్కరణల పేరుతో ఆర్డినెన్స్ తెచ్చి తొలగించిన ఏపీ సర్కార్ కు ఇవాళ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించాలంటూ తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు మరోసారి పరోక్షంగా స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తనను పాత పోస్టులో నియమించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజా ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అభ్యంతరాలను కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

 గవర్నర్ కోర్టులో బంతి...

గవర్నర్ కోర్టులో బంతి...

ఏపీ ప్రభుత్వం తనను ఎన్నికల కమిషనర్ గా నియమించడం లేదంటూ వాదించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. మిమ్మల్ని నియమించే అధికారం గవర్నర్ కు ఉందని తెలిపింది. కాబట్టి గవర్నర్‌ హరిచందన్ ను కలిసి తనను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని కోరాలని నిమ్మగడ్డకు హైకోర్టు సూచించింది. తాము ఇచ్చిన తీర్పు ప్రకారం నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించే అధికారం గవర్నర్ కు ఉందని క్లారిటీ ఇచ్చింది. తమ తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో ఇంకా స్టే రానందున గత ఆదేశాలు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో చివరిగా బంతి గవర్నర్ కోర్టులోకి చేరింది.

 జగన్ సర్కార్ వ్యూహమేంటి ?

జగన్ సర్కార్ వ్యూహమేంటి ?

హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్లో క్లారిటీ లేదని, ప్రభుత్వానికి ఎస్ఈసీని నియమించే అధికారం లేదని అంటే గతంలో నిమ్మగడ్డను కూడా చంద్రబాబు ప్రభుత్వమే నియమించిదంటూ లా పాయింట్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజా ఆదేశాలతో ఇరుకునపడింది. హైకోర్టు ఉత్తర్వులతో తమకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. అయితే నిమ్మగడ్డను తొలగించి జస్టిస్ కనగరాజ్ ను నియమించే విషయంలో గవర్నర్ సాయంతోనే అంతా నడిపించిన ప్రభుత్వం మరోసారి గవర్నర్ సాయంతో ఈ గండం నుంచి గట్టెక్కే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే నిమ్మగడ్డకు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు.

Recommended Video

    Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
     గవర్నర్ ఒప్పుకోకపోతే..

    గవర్నర్ ఒప్పుకోకపోతే..

    నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించే విషయంలో హైకోర్టు తాజా ఆదేశాలను గమనిస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనేలా ఉన్నాయి. గతంలో హైకోర్టు ఆదేశాలు రాగానే వెంటనే పదవీ బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ... తర్వాత ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత వెంటనే గవర్నర్ ను కలిసి తన వ్యవహారం తేల్చాలని నిమ్మగడ్డ ప్రయత్నించే అవకాశముంది. అయితే గవర్నర్ ఇందుకు ఒప్పుకోకపోతే నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వ వాదనకు మద్దతుగా నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ తిరిగి ఇప్పుడు ఆయన్ను అదే పదవిలో కూర్చోబెడుతూ మరో నిర్ణయం తీసుకుంటారా అంటే సందేహమే.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+