Raghurama: రఘురామకు భారీ ఊరట..! ఎమ్మెల్యే అయ్యాక ఇదే తొలిసారి..
ఏపీలో గత ఐదేళ్లు వైసీపీ రెబెల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చి కూటమి అభ్యర్దిగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైసీపీ హయాంలో రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ పవర్ జెన్ కాం లిమిటెడ్ సంస్థ దివాలా తీసింది. దీంతో ఇందులో కీలకంగా ఉన్న రఘురామపై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకునేందుకు రుణదాత అయిన ఎస్బీఐ సిద్ధమైంది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇండ్ భారత్ సంస్థ దివాలా తీసినందున రఘురామ రాజుపై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకునేందుకు ఎస్బీఐ నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. అనంతరం రఘురామపై ఎస్బీఐ తదుపరి చర్యల్ని నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు దీనిపై వివరణ ఇవ్వాలన కోరుతూ ఎస్బీఐతో పాటు రిజర్వు బ్యాంకుకూ నోటీసులు పంపింది.

రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 28న చేపడతామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఆలోపు ఎస్బీఐ, రిజర్వు బ్యాంకు తమ కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో లింక్ అయిన మరో పిటిషన్ లోనూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇదే ఇండ్ భారత్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న సీతారామం కూడా తనపై ఎస్బీఐ చర్యల్ని నిలువరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని నిలిపేసింది. దీంతో వీరిద్దరికీ ఈ కేసులో ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications