• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ బాస్ షో బహిష్కరించాలి: నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ తో అలా చేస్తారా : నారాయణ ఫైర్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

బిగ్ బాస్ షో పైన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. షో తో పాటుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలతో చెలరేగారు. బిగ్ బాస్ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసారు. పూర్తిగా కల్చర్ ను డామేజ్ చేస్తోందంటూ మండి పడ్డారు. బిగ్ బాస్ నెంబర్ ఒన్ క్రైం అంటూ వ్యాఖ్యానించారు. ఈ షో సమాజంలో విష సంస్క్రుతిని పెంచుతోందని ఆరోపించారు. ఈ షో ద్వారా సమాజంలో ఎవరికైనా ఉపయోగం ఉందా అని నిలదీసారు.

బిగ్ బాస్ పేరుతో వేల కోట్ల వ్యాపారం

బిగ్ బాస్ పేరుతో వేల కోట్ల వ్యాపారం

సమాజానికి మేలు చేసే అంశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. అసలు బిగ్ బాస్ షోకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ షో పేరుతో వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని విమర్శించారు. షో చూస్తుంటే కావాలని కోట్లాటలు..అనైతిక విధానాలతో షో కొనసాగుతోందని మండిపడ్డారు. తాను గతంలోనూ ఇదే షో పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసానని..వారు తమకు సంబంధం లేదు..కోర్టుకు వెళ్లమని సూచించారని గుర్తు చేసారు.

కల్చర్ ను పాడు చేస్తోందంటూ

కల్చర్ ను పాడు చేస్తోందంటూ

తాను కోర్టుకు వెళ్లినా తనకు న్యాయ న్యాయ వ్యవస్థ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పనికిమాలిన ప్రోగ్రాంలను అనుమతించటం అనైతికమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని వ్యతిరేకించాని నారాయణ సూచించారు. ఇప్పటికే ఈ బిగ్ బాస్ జాతీయ స్థాయిలోనూ..చాలా ప్రాంతీయ భాషల్లోనూ అనేక సీజన్లు నడుస్తున్నాయంటూ వివరించారు. ఏ రాష్ట్రంలో అయినా ఇది అనైతికమని పేర్కొన్నారు. ఇందులో ఎక్కడైనా ఏమైనా ఉపయోగపడే సందేశాలున్నాయా అని ప్రశ్నించారు.

సోషల్ బాయ్ కాట్ చేయాలని పిలుపు

సోషల్ బాయ్ కాట్ చేయాలని పిలుపు


చూసే విద్యార్దులు-యువత నైతికంగా పడిపోవటానికి ఈ షో కారణమవుతుందన్నారు. అసలు ఈ షో నిర్వాహకులు ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా చేస్తున్నారా అంటూ నారాయణ ప్రశ్నించారు. దీనిని సోషల్ బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో నారాయణ నేరుగా బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున పైన కీలక వ్యాఖ్యలు చేసారు. నాగార్జున ఒక వ్యక్తి ఎదుట ముగ్గురు హీరోయిన్ల ఫొటోలు చూపిస్తూ అడిగిన ప్రశ్నలను ఆయన ప్రస్తావించారు.

నాగార్జున కుటుంబలో వారితో ఇలా చేయగలరా

నాగార్జున కుటుంబలో వారితో ఇలా చేయగలరా

ఆ ముగ్గరులో ఎవరితో ముద్ద పెడతావు..ఎవరితో డేటింగ్ చేస్తావు.. ఎవరితో పెళ్లి చేసుకుంటావు అంటూ అడిగారని..అమాయకులు కాబట్టి అలా అడుగగలుగతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నాగార్జున కుటుంబంలోని ఉన్న వారి ఫొటోలు పెట్టి ఎందుకు అడగరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది ఏం ఎంటర్ టైన్ మెంట్ అంటూ ఫైర్ అయ్యారు. అదంతా ఒక బూతు ప్రపంచంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారదు. పిల్లలను చెడగొడుతున్నారని ఫైర్ అయ్యారు.

Recommended Video

Revanth Reddy comments on Krishna River Managemnt Board | Oneindia Telugu
40 రోజులు హౌస్ లో పెట్టి ఏం చేస్తున్నారు

40 రోజులు హౌస్ లో పెట్టి ఏం చేస్తున్నారు

ఆ కాన్సెప్టే కరెక్ట్ కాదని చెబుతూ... కంటెస్టెంట్స్ ను 40 రోజులు హౌస్ లోపల పెట్టేసి .. ఇష్టానుసారం చేయటం ఎందుకు.. ఇది ఉపయోగపడుతందంటూ సీపీఐ నారాయణ తనదైన శైలిలో ఆవేశంతో ఊగిపోయారు. గత సీజన్ సమయంలోనూ నారాయణ ఇదే రకంగా బిగ్ బాస్ నిర్వహణ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ రియాల్టీ షో పైన నారాయణ చేసిన వ్యాఖ్యల పైన నిర్వహకులు స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

English summary
CPI Narayana sensational comments on Big boss and host Nagarjuna. He says people must boycott this show and demanded to stop this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X