BIGG BOSS-5: ఆ నలుగురు అతి తగ్గించుకోవాలి : షో ఎక్కువ రోజులు నడవదా : నెటిజెన్స్ ఒపీనియన్..!!
బుల్లితెర పైన మస్తు మజా అందిస్తుందని అంచనా వేసిన బిగ్ బాస్ -5 సీజన్ లో కంటెస్టెంట్స్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో చర్చ - రచ్చ జరుగుతున్నాయి. కొందరు కంటెస్టెంట్స్ తీరు పైన నెటిజెన్లు తమ అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఒక రకంగా కొందరి కంటెస్టెంట్స్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సీజన్ లో కంటెస్టెంట్స్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం సహజం. కంటెస్టెంట్స్ ఒక సారి హౌస్ లోకి వస్తే అన్ని రకాల ఎమోషన్లను పండించాలి.

టాస్కులు ఇవ్వకుండానే ముందుగానే..
అందులో భాగంగా.. నవ్వడం, నటించడం, పోట్లాటకు దిగడం, టాస్క్‌లు ఆడటం.. అన్నీ చేయాల్సిందే. కానీ, కొందరు తమకు ఏ టాస్కు లేకుండానే ఓవర్ చేస్తున్నారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వీళ్లకు వీళ్లే దొంగతనాలు చేస్తూ, ప్రాంక్‌లు చేస్తూ, గొడవలు పెట్టుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, అదంత మంచిది కాదంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. గత ఆదివారం హోస్ట్ నాగార్జున..బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంటెస్టెంట్స్ పరిచయం సైతం ఆకట్టుకొనే స్థాయిలో కొనసాగింది.

దొంగతనం ఎపిసోడ్ పండలేదంటూ
షో లో భాగంగా.. సెకండ్ కంటెస్టెంట్‌గా వచ్చిన సన్నీకి తన స్వప్న సుందరిని హౌస్‌లో వెతుక్కోమని సలహా ఇచ్చాడు నాగ్. ఈ మాత్రం చాన్స్ ఇస్తే చాలని రెచ్చిపోయిన సన్నీ గేట్ ద్వారా కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన ప్రతిసారి కొంత అతి చేశాడనే అభిప్రాయం నెటిజెన్లు నుంచి వ్యక్తం అవుతోంది. ఇక, సిరి హన్మంత్, జెస్సీ తమకు నాగార్జున నుంచి టాస్క్ రాకపోముందే తమకు తామే దొంగతనం టాస్క్ ఇచ్చుకున్నారు. చిన్నాచితకా వస్తువులు దొంగతనం చేసినా యాంకర్ రవి వీరిని పసిగట్టేయడంతో చోరీ టాస్క్ పైన నెగటివ్ ఒపీనియన్ వినిపిస్తోంది.

నార్మల్ గా ఉండమంటూ లహరి కౌంటర్
ఇక, సిరి.. లోబోతో గొడవ పడుతున్నట్లు ప్రాంక్ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అది నిజమైన గొడవగా మారిపోయింది. ఆ సమయంలో ఇద్దరూ తగ్గలేదు. ఆ తరువాత ఇది ప్రాంక్ అంటూ బయట పెట్టారు. అయితే ఇది కరెక్ట్ కాదని, కంటెంట్ కోసం చేసినట్లుందని సరయూ నిర్మొహమాటంగానే చెప్పేసింది. మరోపక్క కాజల్ అత్యుత్సాహం అసలుకే ఎసరు తెస్తోంది. అతి చేయకుండా నార్మల్‌గా ఉండమని లహరి అందరి ముందే కౌంటరిచ్చింది. అయితే లహరి కూడా కావాలని అందరి దగ్గరా గొడవ పెట్టుకుంటోందని అంటున్నారు.

ఆ నలుగురు అతిగా స్పందిస్తున్నారంటూ
మొత్తంగా వీజే సన్నీ, సిరి హన్మంత్, కాజల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే అతి చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కాజల్ అందరి దగ్గరకు వెళ్లి పర్సనల్ విషయాలను ఎందుకు అడుగుతుంని..అసవరం ఏంటనే చర్చ వినిపిస్తోంది. లేడీ అర్జున్‌రెడ్డి లహరి కూడా కావాలని అందరితో గొడవలు కొని తెచ్చుకుంటున్నట్లు అనిపిస్తోందని ఒపీనియన్ వినిపిస్తోంది. వీజే సన్నీ, సిరి హన్మంత్, లహరి, కాజల్ ఓవరాక్షన్ చేస్తున్నారనే అభిప్రాయం ఎక్కవ సంఖ్యలో నెటిజెన్ల నుంచి వ్యక్తం అవుతోంది.
Recommended Video

ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఆడియన్స్
అయితే, ఈ నలుగురు అతి తగ్గించుకుంటే షోలో ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ కోల్పోతారంటూ వారికి సూచిస్తున్నారు. అయితే, ఈ సీజన్ మాత్రం గత సీజన్లకు భిన్నంగా కొంత డిఫరెంట్ గా చూపించే ప్రయత్నంలో అక్కడక్కడా జరుగుతున్న పొరపాట్లు మొత్తం షో ఉద్దేశాన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాయనేది సోషల్ మీడియాలో సాగుతున్న చర్చ. షో మొదలు పెట్టిన నాలుగు రోజులకే ఇటువంటి చర్చ జరగటం గతంలో ఎప్పుడూ లేదనే తెలుస్తోంది. అయితే, కొందరి కంటెస్టెంట్స్ కు మద్దతుగా అభిమానులు సైతం సోషల్ మీడియాలో పోస్టింగ్ లతో హంగామా చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని కౌంటర్ చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications