ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్
భారతీయ రైల్వే ప్రస్థానం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ పరంగా ప్రస్తుతం నాలుగోస్థానంలో నిలిచింది. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులను 13,600 రైళ్లద్వారా వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. 1.30 లక్షల కిలోమీటర్లకు పైగా రైల్వే మార్గం ఉంది. డబుల్ లైన్లు ఉన్నచోట రద్దీని నియంత్రించేందుకు మూడో రైల్వే లైను కూడా నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్లు ఉన్నచోట్ల డబుల్ లైన్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. సరకు రవాణా కోసం ప్రత్యేక రైల్వే లైన్లను ఏర్పాటు చేసే యోచనలో భారతీయ రైల్వే ఉంది.
ఆసియాలో రెండో పెద్ద జంక్షన్ గా
భారతదేశంలో అతి పెద్ద రైల్వే జంక్షన్ గా పశ్చిమబెంగాల్ లోని హౌరా జంక్షన్ నిలిచింది. ఈ స్టేషన్ లో 18 ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. ప్రతిరోజు హౌరామీదుగా 600 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిని నియంత్రించడం రైల్వేకు అతి పెద్ద సవాల్ గా మారింది. పశ్చిమబెంగాల్ లోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లాలన్నా హౌరా రావాల్సిందే. రాకపోకలు ఇక్కడినుంచే సాగుతుంటాయి. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్ గా కూడా రికార్డులకెక్కింది. భారతదేశంలో ఏ ప్రధాన నగరం నుంచి హౌరాకు రైలు బయలుదేరినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటుంది. రిజర్వేషన్ బోగీలు కూడా జనరల్ బోగీల్లా ఉంటాయి. అంతటి రద్దీ హౌరా వెళ్లే రైళ్లల్లో నెలకొంటుంది.

ఒక బోగీ తయారీకి రూ.3 కోట్లు?
ప్రయాణికులను చేరవేసే రైలును తయారుచేయడానికి భారతీయ రైల్వేకు సగటున రూ.70 కోట్లు ఖర్చవుతోంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బోగీలను నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. పట్టాలపై ప్రయాణించేటప్పుడు ఎటువంటి కుదుపులకు లోనవకుండా ఉండేందుకు లింక్డ్ హాఫ్ మన్ బష్ బోగీలను వాడుతున్నారు. ప్రారంభంలో ఇవి జర్మన్ సాంకేతికతతో తయారయ్యేవి. ప్రస్తుతం భారత్ లోనే ఇవి తయారవుతున్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో దాదాపు అన్ని ప్రధాన రైళ్లు ఎల్హెచ్ బీ బోగీలతోనే నడిచే అవకాశం ఉంది. అలాగే ఒక ఇంజన్ తయారు చేసేందుకు రూ.20 నుంచి రూ.22 కోట్ల వ్యయం అవుతోంది. అలాగే ఒక బోగీ తయారీకి రూ.2 నుంచి రూ.3 కోట్ల ఖర్చవుతోంది. రైల్వేకు 100 రూపాయలు వస్తే అందులో నిర్వహణకు 87 రూపాయల వరకు పోతున్నాయి. మిగిలినవన్నీ 13 రూపాయల్లో సర్దుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications