గుంటూరులో ఓ హోటల్ లో బర్త్ డే పార్టీ .. కాల్ గర్ల్స్ తో .. రేవ్ పార్టీనా ?పోలీసుల విచారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు అరండల్ పేట లోని ఓ హోటల్ లో జరిగిన బర్త్ డే పార్టీ స్థానికంగా చర్చనీయాంశమైంది. గుంటూరు అరండల్ పేట లోని హోటల్ లో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో కాల్ గర్ల్స్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు . ఈ తనిఖీలలో స్నేహితుని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
హోటల్ లో జరిపిన దాడుల్లో పోలీసులు బెంగళూరుకు చెందిన ముగ్గురు అమ్మాయిలను, అలాగే బర్త్ డే పార్టీ నిర్వహించిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించారు పోలీసులు. అయితే హోటల్లో ఏం జరిగింది, రేవ్ పార్టీ ఏమైనా నిర్వహించారా ? హోటల్ యాజమాన్యానికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్ నిర్వాహకులను సైతం ప్రశ్నిస్తున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ పార్టీ ఎవరు నిర్వహించారు అనేది మాత్రం పోలీసులు గుట్టుగా ఉంచుతున్నారు .

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అసలే కరోనా మహమ్మారి తో రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం గా ఉన్న సమయంలో ఇలాంటి పార్టీలు సైతం పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఇటు హైదరాబాద్ లోనూ రేవ్ పార్టీ కల్చర్ బాగా పెరిగింది. హైదరాబాద్ శివారు రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications