ముగ్గురు మాజీ మంత్రులకి బొత్స షాక్, గదికే పరిమితం
విశాఖ: మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ కారణంగా ముగ్గురు మాజీ మంత్రులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలకు భంగపాటు ఎదురయిందట. విశాఖలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సిఎం విడుదల చేయనున్న శ్వేతపత్రాల పరిశీలనకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన శనివారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ మేరకు ఆయన యల్లమ్మతోట కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రులు బాలరాజు, వట్టి వసంత్ కుమార్లతో పాటు ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరుల సమావేశం మొదలు పెట్టేందుకు వారు సిద్ధమవుతుండగా.. బొత్స సత్యనారాయణ అక్కడకు వచ్చారు. సమావేశంలో కూర్చున్న వారితో కొంతసేపు మాట్లాడారు. అనంతరం ఆయన సమావేశ గది నుండి బయటకు వచ్చి విలేకరులతో బెహరా, పేడాడతో కలిసి ఆయన ఒక్కరే సమావేశం నిర్వహించారు.
సమావేశానికి కన్నా, బాలరాజు, వసంత్ కుమార్లను దూరంగా పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వారంతా బొత్స పైన అసంతృప్తితో అక్కడి నుండి వెళ్లిపోయేందుకు బయటకు వచ్చారు. అది గమనించిన బొత్స వారిని లోపలకు వెళ్లిపోవాలని సూచించారట. దీంతో వారు కక్కలేక మింగలేక గదికే పరిమితమయ్యారట.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications