ఎస్వీలో వెంకయ్యకు చేదు, తెలుగురాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన: హర్ష

చిత్తూరు: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు.

తొలుత పలువురు విద్యార్థులకు ఆయన పట్టాలు అందించారు. అనంతరం ఆయన ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా పైన నిరసన వ్యక్తం చేశారు.

వెంకయ్య నాయుడు ప్రసంగం ఆరంభం కాగానే ప్లకార్డులతో విద్యార్థులు నిరసనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైందని వారు నిలదీశారు. దీంతో, పరిస్థితులు అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Bitter experience to Venkaiah Naidu

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి: హర్ష కుమార్

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. ఏపీ, టీఎస్‌ల మధ్య సమస్యల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ప్రయత్నించడం లేదని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+