సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు ఊహించని నేత - లాస్ట్ మినిట్ ట్విస్ట్..!!
సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు వెళ్లే దెవరు. ఏపీలో వైసీపీ మాజీ నేత సాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ కు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే ఇందు కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో కూటమి ఈ సీటు ఏకగ్రీవంగా గెలుచుకోనుంది. కాగా, ఈ స్థానం బీజేపీ కోరటంతో టీడీపీ, జనసేన అంగీకరించాయి. బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా రేసులోకి వచ్చాయి. తాజాగా సీఎం చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చల వేళ రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశం పైన తుది నిర్ణయానికి వచ్చారు.
చివరి నిమిషంలో
ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ను రాజ్యసభకు పంపాలని బీజేపీ దాదాపు నిర్ణయించింది. అదే సమయంలో అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ పేరు చివరి నిమిషంలో పరిశీలనకు వచ్చింది. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘాల నేత ఆర్ క్రిష్ణయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ నుంచి తాజా గా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎమ్మార్సీఎస్ నేత మంద కృష్ణ మాదిగ ను బీజేపీ నుంచి రాజ్యసభకు సాయిరెడ్డి స్థానంలో ఏపీ నుంచి ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీంతో, అన్నామలై.. మంద కృష్ణ మాదిగ లో ఒకరికి ఈ స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు - షా చర్చలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు - కేంద్రం హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తమ పార్టీ అభ్యర్దిగా అన్నామలై పేరు పైన ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో అన్నామలై తో పాటుగా మంద కృష్ణ మాదిగ గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూటమి రాజకీయ సమీకరణాల్లో భాగంగా మంద కృష్ణ మాదిగ కు ఇవ్వటం పైన చంద్రబాబు అభిప్రాయాన్ని అమిత్ షా కోరినట్లు సమాచారం. బీజేపీ ఈ సీటు తీసుకోవటంతో.. ప్రస్తుతానికి అన్నామలై వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి సీటు విషయంలో మంద కృష్ణ మాదిగ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక, ఏపీ నుంచి అన్నామలై ఎంట్రీ వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. ఇక, అన్నామలై కేంద్ర మంత్రి అవ్వటం దాదాపు ఖాయమైంది.
నిర్ణయం వెనుక
వచ్చే ఏడాది తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్కడ అన్నా డీఏంకేతో పొత్తు ఖాయం చేసుకుంది. ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నామలైను తప్పించారు. పొత్తు ప్రకటన వేళ పార్టీ ముఖ్యనేత అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. అన్నామలైకు ఇవ్వటం ద్వారా ఏపీ - తెలంగాణలోనూ రానున్న రోజుల్లో పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ సనాతన ధర్మం పేరుతో ఏపీలో కొత్త సమీకరణాలకు తెర తీసారు. ఇప్పుడు అన్నామలై సైతం ఏపీ నుంచే ఎంపీగా ఉంటే బీజేపీ భవిష్యత్ వ్యూహాలు పక్కాగా అమలు చేయవచ్చని చెబుతున్నారు. దీంతో, అన్నామలై కు ఏపీ నుంచి రాజ్యసభకు పంపటం ద్వారా కొత్త రాజకీయం మొదలు కానుంది.












Click it and Unblock the Notifications