బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్దిగా వీర్రాజు - మారుతున్న లెక్కలు..!!
ఏపీలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారయ్యారు. టీడీపీ మూడు, జనసేన - బీజేపీ చెరో స్థానం దక్కించుకున్నారు. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసారు. నాలుగు సీట్ల పైన తర్జన భర్జన ల తరువాత బీజేపీకి సీటు ఖరారైంది. చివరి నిమిషంలో బీజేపీ ఢిల్లీ నేతలు ఎంట్రీ ఇవ్వటంతో టీడీపీ ఒక సీటు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో.. టీడీపీ మూడు స్థానాలకే తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఇక, బీజేపీ అభ్యర్దిగా పార్టీ నాయకత్వం తుది కసరత్తు తరువాత అధికారిక ప్రకటన చేసింది.
బీజేపీ అభ్యర్దిగా
కూటమిలో బీజేపీ అనుకున్నది దక్కించుకుంది. ఇప్పటికే ఒక రాజ్యసభ సీటు దక్కించుకున్న బీజేపీ.. మరో సీటు పైన తేల్చి చెప్పింది. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ సీటును ఖాయం సొంతం చేసుకుంది. పార్టీ అభ్యర్దిగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పార్టీ ఖరారు చేసింది. గతంలో ఇదే పొత్తులో భాగంగా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. తొలి నుంచి బీజేపీలో అంకిత భావంతో పని చేస్తున్న సోము వీర్రాజును పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి జాతీయ కమిటీలో అవకాశం కల్పించారు. సోము స్థానంలో పురందేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు.

వీర్రాజు పేరు ఖరారు
సోము వీర్రాజును పార్టీ అభ్యర్దిగా అధికారికంగా ప్రకటించారు. ఏపీ బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న సోము వీర్రాజుకి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఖరారు చేయటం ద్వారా బీజేపీ ప్లాన్ ఏంటో స్పష్టం అవు తోంది. వీర్రాజుతో పాటుగా మాధవ్, మరో ఇద్దరు నేతల పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నాయి. చివరగా వీర్రాజు వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. ఇప్పటికే నాగబాబుకు జనసేన నుంచి ఎమ్మెల్సీ సీటు ఖాయం కావటంతో..ఇక కూటమి నుంచి అదే సామాజిక వర్గానికి ఎమ్మెల్యేగా ఛాన్స్ ఉండదని భావించారు. ఇప్పుడు బీజేపీ నిర్ణయంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రణాళికల విషయంలో పక్కా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమి అభ్యర్ధులతో కలిసి వీర్రాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
చివరి నిమిషంలో
కూటమిలో భాగస్వామిగా బీజేపీకి ప్రస్తుతం ఎమ్మెల్సీ సీటు దక్కింది. కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజ్యసభ సీట్ల విషయం లో తమకే ప్రాధాన్యత కావాలని ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకత్వం కూటమి మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది. ఆర్ క్రిష్ణయ్య రాజీనామా.. తిరిగి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైసీపీ నేత సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటు సైతం బీజేపీకి దక్కనుంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ నేతలు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ నేతల ఒత్తిడితో చివరి నిమిషంలో చంద్రబాబు ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వక తప్పలేదు. దీంతో..భవిష్యత్ లోనూ బీజేపీ తమ పట్టు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications