• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం అనుమతి డౌటేనా : హోం శాఖ అప్పుడే..: కన్నా వ్యాఖ్యల వెనుక..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజధాని మార్పు నిర్ణయం పైన కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి. కేంద్ర ప్రభుత్వంలో సంప్రదించి..వారి అనుమతితోనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారంటూ వచ్చిన వార్తలను బీజేపీ కీలక నేతలు ఖండించారు. అయితే, రాష్ట్రం కోరితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని కొందరు బీజేపీ ఎంపీలు చెప్పుకొచ్చారు. కేంద్రం నుండి ఏపీలో రాజధాని రగడ పైన ఇప్పటి వరకు అధికారిక స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత.. కేంద్రం సూచన కోరితేనే స్పందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలోనే చెప్పారు. అయితే, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఏపీ బీజేపీ ఇప్పటికే అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానం చేసింది. దీంతో..ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతోంది..కేంద్రం ఆలోచన ఏంటి అనేదే ఇప్పుడు హాట్ టాపిక్..

కేంద్రం అనుమతి అవసరం..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇందుకు కేంద్రం అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అయితే రాజధాని మార్పునకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖకు లేఖ రాసినప్పుడు మాత్రమే అది స్పందిస్తుందన్నారు. పునర్విభజన చట్టం అమలుకు హోం శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉందని.. అందుచేత మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం అనుమతి తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.

BJP AP Chief Kanna comments on Three capitals decision now became hot topic in political circles

ఐదున్నరేళ్ల క్రితం నిర్ణయించి.. కేంద్రం నిధులు అందుకున్న రాజధానిని కొత్త ప్రభుత్వం మరో చోటకు మార్చితే కేంద్రం వైఖరి, సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనే అనుమానం ఇప్పుడు రాజకీయంగా వ్యక్తం అవుతోంది. జగన్‌ది పిచ్చి తుగ్లక్‌ పాలనని, పిచ్చి తుగ్లక్‌ను మించిపోయారని విమర్శించారు. గతంలో అమరావతి పేరుతో చంద్రబాబు భూ దాహంతో ఎలా దందాలు చేశారో.. ఇప్పుడు జగన్‌ కూడా విశాఖపట్నంలో భూ దాహం తీర్చుకోవాలని చూస్తున్నారని కన్నా ఆరోపించారు.

సీఎం జగన్ కు హక్కు లేదంటూ..
ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన రాజధాని అమరావతి విషయంలో అడ్డగోలుగా వెళ్లడాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని కన్నా చెప్పారు. కేంద్రం అనుమతితో కొత్త రాజధాని ఏర్పడిందని.. వందల కోట్ల నిధులిచ్చిందని గుర్తు చేసారు. ఇప్పుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చే హక్కు జగన్‌కు లేదన్నది పార్టీపరంగా మా అభిప్రాయమని తేల్చి చెప్పారు. అమరావతిని మార్చడానికి అనేక కుంటిసాకులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. రాజధాని అంశం ఒక్క 29 గ్రామాలకో, రెండు జిల్లాలకో సంబంధించిన సమస్య కానే కాదని, ఇది ఐదు కోట్ల మంది జనాభాకు సంబంధించిన సమస్యని తెలిపారు.

రైతులు యావత్‌ రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే భూములు ఇచ్చారని, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ కూడా అంగీకరించారని, ఇప్పుడు వారికి అన్యాయం చేస్తూ, నియంతగా పాలిస్తున్నారని దుయ్యబట్టారు. అయితే, ఇదే సమయంలో పవన్ సైతం ఈ నిర్ణయం తాత్కాలికమని చెప్పటం..కేంద్ర హోం శాఖ అనుమతి కావాల్సిందేనని కన్నా వ్యాఖ్యానించటం ద్వారా ఏపీ ప్రభుత్వ నిర్ణమయం పైన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయే ఉత్కంఠ మొదలైంది.

English summary
BJP AP Chief Kanna Lakshmi Narayana comments on Three capitals decision now became hot topic in political circles. He says state Central Home ministry permission must for capital shifting. Kanna remebered AP Re organisation act and centals financial assistance for AP capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X