ఏపీలో పొత్తులపై బీజేపీ తాజా సంకేతాలు - ఇక అధికారికం..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో పొత్తుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన ఇప్పటికే తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ సమయంలోనే బీజేపీ వైఖరి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ముఖ్య నేతలు విజయవాడ చేరుకున్నారు. పొత్తుల పైన ఆ నేతలు ఇస్తున్న సంకేతాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.
బీజేపీ కసరత్తు : ఏపీలో పొత్తుల పైన బీజేపీ ఇస్తున్న సంకేతాల అర్దం ఏంటి. బీజేపీ ముఖ్యనేత శివప్రకాశ్ ఏపీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అటు టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తు పైన వేచి చూస్తున్న సమయంలోనే ఇటు అభ్యర్దుల కసరత్తు పైన కాషాయం పార్టీ మొదలు పెట్టింది. పార్టీ నుంచి వస్తున్న ఆదేశాలతో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసే ప్రక్రియను బీజేపీ మొదలు పెట్టింది. పొత్తులు ఎలా ఉన్నా సొంతంగా పోటీ చేసే అవకాశాల పైన అధ్యయనం చేస్తోంది. పార్టీ నేతలతో పొత్తుల పైన ఆరా తీస్తూనే..సొంతంగా పోటీ చేయటం పైన ఫోకస్ చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే 2,500 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

పార్టీ అభ్యర్దుల ఎంపిక : శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో ఈ రోజు, రేపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలను బీజేపీ నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి ప్రతి జిల్లా నుంచి ఆరుగురు ముఖ్యనేతలు హజరు కాబోతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక్కో సెగ్మెంట్ నుంచి ముగ్గురిని ఎంపిక చేసి పార్టీ సెంట్రల్ కమిటీకి నివేదించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం..సామాజిక సమీకరణాల పైన బీజేపీ పూర్తిగా ఫోకస్ చేసింది. పార్టీలో నేతల సూచనలు, సర్వేల ఆధారంగా ముందుకు వెళ్తోంది. పార్టీ భవిష్యత్ కు మేలు చేసే నిర్ణయాలే జాతీయ నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలోనే పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. పొత్తుల పైన పార్టీ నాయకత్వానిదే తుది నిర్ణయమని చెప్పారు. పొత్తుల పై తేల్చే వరకూ తాము అన్ని స్థానాల్లో అభ్యర్దుల ఎంపిక కసరత్తు చేస్తున్నామని స్పష్టం చేసారు.

బీజేపీ డిసైడ్ అయిందా : ఎన్నికల్లో పోటీకి సిద్దం కావాలని జిల్లా నేతలు పార్టీ నాయకత్వం మార్గనిర్దేశం చేసింది. ప్రజా పోరు యాత్రలతో మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించింది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్దుల చొప్పున స్క్రీనింగ్ చేసి పార్టీ నాయకత్వానికి రాష్ట్ర నేతలు పంపుతున్నారు. దీని పైన పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కసరత్తు చేస్తోంది. ఆ తరువాత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏపీలో అభ్యర్దుల పైన నిర్ణయం తీసుకోనుంది. వరుసగా ఎంపీ అభ్యర్దుల ఖరారు పైన పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇక..పొత్తుల పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా బీజేపీ స్పష్టత ఇవ్వనుంది. ఈ కసరత్తు ద్వారా సీట్ల కోసం ఒత్తిడి పెంచుతోందా..లేక ఒంటరి పోరుకే సిద్దమైందా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications