మోహన్ బాబుతో సోము వీర్రాజు భేటీ - కీలక నిర్ణయం..!?

మోహన్ బాబుతో సోము వీర్రాజు భేటీ వేళ కీలక నిర్ణయం దిశగా చర్చలు జరిగినట్లు సమాచారం.

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. పార్టీల్లో చేరికల పైన ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ- టీడీపీ మధ్య నేతల జంపింగ్స్ మొదలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరటం ఖరారైంది. ఇదే సమయంలో మరి కొందరు ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియను బీజేపీ వేగవంం చేసింది. అందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రముఖ నటుడు మోహన్ బాబుతో సమావేశమయ్యారు. గంట సేపు ఇద్దరి మధ్య ఏకంతా చర్చలు జరిగాయి. కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. త్వరలోనే నిర్ణయం ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మోహన్ బాబు ఇంటికి వీర్రాజు

మోహన్ బాబు ఇంటికి వీర్రాజు

తిరుపతిలో మంచు మోహన్ బాబు ఇంటికి పార్టీ నేతలతో కలిసి సోము వీర్రాజు వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతు కోరేందుకు వెళ్లినట్లు చెబుతున్నారు. రాయలసీమ బీజేపీ అభ్యర్ధి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి మద్దతుగా సోము వీర్రాజు ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశం తరువాత మోహన్ బాబు - సోము వీర్రాజు మధ్య దాదాపు గంట సేపు ఒన్ టు ఒన్ సమావేశం జరిగింది. ఇందులో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పట్ల ఆసక్తి ఉన్న వారి చేరికలను వేగవంతం చేయాలని పార్టీ నాయకత్వం రెండు రాష్ట్రాల నేతలకు స్పష్టం చేసింది. ఏపీలో త్వరలో బీజేపీలో కీలక చేరికలు ఉంటాయని కొద్ది రోజుల క్రితమే పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. అందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ చేరిక ఖాయమైంది. ఇప్పుడు మరో ఇద్దరు ముఖ్య నేతల పేర్లు ప్రచారం లో ఉన్నాయి.

మోహన్ బాబు అడుగులు ఎటు

మోహన్ బాబు అడుగులు ఎటు

టీడీపీలో ఎన్టీఆర్ హయాంలో పని చేసిన మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసారు. జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. కానీ, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పటి వరకు కలవలేదు. మంచు విష్ణు మాత్రం సీఎం జగన్ ఇంటికి వెళ్లి కలిసారు. మోహన్ బాబుకు టీటీడీ ఛైర్మన్ .. నామినేటెడ్ పోస్టు ఇస్తారని ప్రచారం సాగింది. మోహన్ బాబు మాత్రం తాను జగన్ సీఎం కావాలని కోరుకున్నానని..ఎటువంటి పదవి ఆశించలేదని స్పష్టం చేసారు. కొద్ది నెలల క్రితం అనూహ్యంగా మోహన్ బాబు హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీని పైన మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. సాయిబాబా ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించేందుకు కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. కానీ, రాజకీయంగా మోహన్ బాబు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన విద్యాసంస్థల పైనే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు.

బీజేపీలోకి పెదరాయుడు ఎంట్రీ ఇస్తారా

బీజేపీలోకి పెదరాయుడు ఎంట్రీ ఇస్తారా


మోహన్ బాబు పలు సందర్భాల్లో ప్రధాని మోదీ పైన అభిమానం చాటుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటుగా ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే మోహన్ బాబు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారం సాగింది. కానీ, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీలో చేరనని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఆ తరువాత ఆయన మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల వాతావరణం క్రమేణా వేడెక్కుతోంది. పొత్తుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలో ప్రముఖలను పార్టీలో ఆహ్వానించే ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. మోహన్ బాబును బీజేపీలోకి రావాల్సిందిగా సోము వీర్రాజు ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, మోహన్ బాబు తాను నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు మోహన్ బాబు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఆసక్తి అటు సినీ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+