జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని.. 2029 లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ ధీమాగా చెబుతున్నారు. పాదయాత్రకు సమాయత్తం అవుతున్నారు. ఇదే సమయంలో పలు కేసులు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. నియోజక వర్గాల పునర్విభజన పైన కేంద్రం ముందుకు వెళ్తోంది. కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ అరెస్ట్ గురించి బీజేపీ కీలక నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగింపు.. జగన్ రాజకీయ భవిష్యత్ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వం కేవలం ఐదేళ్లకే పరిమితం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది మరో 30 ఏళ్ల పాటు కొనసాగినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. జగన్ తన హయాంలో చేసిన తప్పులకు జైలుకు వెళ్లాల్సిందేనని మాధవ్ స్పష్టం చేశారు. కాగా, అదే సమయంలో జగన్‌ను బీజేపీ కాపాడుతోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. లిక్కర్ కేసులో ఇప్పటికే కొందరు దొరికారని చెప్పిన మాధవ్.. ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని వివరించారు. పక్కా ఆధారాలు లభించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పిన మాధవ్.. ఇక అరెస్ట్ అనేది కేవలం సమయంతో కూడుకున్న పని మాత్రమే నని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ఆశీర్వాదం పొందాలని ప్రధాని మోదీ కూడా సూచించారని వెల్లడించారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వమే మళ్లీ కొనసాగుతుంది
ఇక, తిరుమల లడ్డూ వివాదం పైనా మాధవ్ స్పందించారు. లడ్డూ విషయంలో ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాలని, అపవిత్రం ఏ మేరకు జరిగిందో.. తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనేక విచారణలు జరుగుతున్నప్పటికీ స్పష్టత రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదం రాజకీయ వివాదంగా మారటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావా లను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక.. పవన్ పదే పదే కూటమి మరో 15 ఏళ్లు కొనసాగుతుందని చెబుతున్న అంశం పైనా మాధవ్ స్పందించారు. ఏపీ భవిష్యత్ కు కూటమి ఐక్యత.. పాలన అవసరమని వివరించారు. ఏపీ బీజేపీలో గ్రూపులు.. విభేదాలు లేవని.. అందరూ పార్టీ కోసం కలిసి పని చేస్తున్నామని తేల్చి చెప్పారు. కాగా, జగన్ పైన మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారాయి.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!













Click it and Unblock the Notifications