చంద్రబాబుకు షాక్.. జగన్ మద్దతు కోరిన బీజేపీ
పార్లమెంట్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్‌సభ స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ వైసీపీ అధినేత జగన్ మద్దతు కోరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీనే సొంతం 300 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ సొంతంగా 240 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కింది.
ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించింది. దీంతో లోక్ సభ స్పీకర్ రేసులో కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమికి ససేమిరా అనడంతో తొలిసారి లోక్ సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దించగా.. సీనియర్ ఎంపీ సురేష్‌ను ఇండియా కూటమి పోటీలో నిలిపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

దీనిలో భాగంగానే లోక్ సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది. అయితే, ఎన్డీఏ కూటమిలో తెలుగు దేశం, జనసేన పార్టీలు ఉండడంతో.. వైసీపీ మద్దతిస్తుందా లేదా ? అనే సస్పెన్స్ కొనసాగింది.. కానీ, ఆ ఉత్కంఠకు తెరదించుతూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేయాలని వైసీపీ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో, ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది.
వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏకు ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది. వైసీపీ సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్టు అయింది.అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతివ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైందిఅసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకు సానుకూలంగా స్పందిచాడా? అనేది హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications