Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ ఛలో అమలాపురం: ఆ నిధులు ఇవ్వాల్సిందే; జగన్ ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడివ్యూహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. జగన్ సర్కార్ పై ఒకపక్క టిడిపి, మరోపక్క జనసేన పోరాటం చేస్తుంటే బిజెపి కూడా తన వంతు దూకుడు కొనసాగిస్తోంది. ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి బిజెపి వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా నేడు బిజెపి ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఎన్నో ప్రాజెక్టులను ఇస్తుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇస్తున్న ప్రాజెక్టులను నీరుగారుస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.

జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ ఛలో అమలాపురం

జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ ఛలో అమలాపురం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను, చెల్లించాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని వైసిపి ఎంపీలు చెబుతున్న వేళ, కేంద్రం ఇస్తున్న ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా నిధులను ఇవ్వడం లేదని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నేడు బిజెపి ఛలో అమలాపురం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోసం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వండి.. బీజేపీ డిమాండ్

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోసం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వండి.. బీజేపీ డిమాండ్

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 25 శాతం నిధులు సమకూర్చాలి. అయితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చక పోవడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 358 కోట్ల రూపాయలు ఇస్తేనే ఈ పనులు ముందుకు సాగుతాయని కేంద్రం ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. ఈ రైల్వే లైన్ పూర్తయితే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రం ఇవ్వకపోవటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని కేంద్రం ప్రకటించింది.

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులపై జగన్ ను టార్గెట్ చేసిన బీజేపీ

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులపై జగన్ ను టార్గెట్ చేసిన బీజేపీ


దీంతో ఏపీ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, నిధులు విడుదల చేయకపోవడం వల్ల కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వైసీపీ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. ప్రజల్లోకి ఈ విషయం చేరాలని నేడు మహా ధర్నాకు నిర్ణయం తీసుకున్నారు.

Recommended Video

    Bandi Sanjay : కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడతాం | Oneindia Telugu
     ధర్నాలో సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ తదితరులు

    ధర్నాలో సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ తదితరులు

    బిజెపి తలపెట్టిన ఛలో అమలాపురం భారీ ధర్నా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొంటారని సమాచారం. బీజేపీ ధర్నా నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొనే అవకాశం ఉన్న కారణంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహిస్తున్న ఛలో అమలాపురం కొనసాగుతుందా? పోలీసులు అడ్డుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+