పురందేశ్వరికి పొగ పెట్టిన 'ముఖ్య' నేత- ఔట్, లిస్టులో నెక్స్ట్..!!
ఏపీలో రాజకీయ సమీకరణలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల పైన కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీలో తమ పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రస్తుతం అనుకూలంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ దిశగానే వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేస్తోం ది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం పైన ఎంపిక పైన ఒక నిర్ణయానికి వచ్చింది. కాగా, పురందేశ్వరి మార్పు నిర్ణయం వెనుక కీలక నేతల లాబీయింగ్ ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
బీజేపీలో మార్పులు
ఏపీ బీజేపీలో కీలక మార్పులకు రంగం సిద్దమైంది. ఏపీలో రానున్న నాలుగేళ్ల కాలంలో బలోపేతం దిశగా పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో కొనసాగుతూనే తమ పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని రాష్ట్ర నేతలకు పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఇక, పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని నిర్దేశించింది. వచ్చే నెల నుంచి తరచూ పార్టీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ ఫిక్స్ చేసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయం వెనుక ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

పురందేశ్వరిపై ఫిర్యాదులు
పురందేశ్వరి పైన పార్టీలో ముఖ్య నేత వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు రేసులో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ, ఆయన పేరు తాజాగా రాజ్య సభకు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పురందేశ్వరి బీజేపీ ప్రయోజనాల కంటే మిత్రపక్షాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ ముఖ్య నేత కొన్ని నిర్ణయాలు.. వాటి ప్రభావం పైన హైకమాండ్ కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇక, ఏపీలో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా సీమ నుంచి ఈ సారి అధ్యక్షుడిని ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం.
కొత్త అధ్యక్షుడిగా
పురందేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగించాలని భాగస్వామ్య పార్టీలకు చెందిన ముఖ్యలు బీజేపీ నాయకత్వానికి ప్రతిపాదన చేసినట్లు ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుల ఖరారులోనూ పార్టీ నాయకత్వం మధ్య సమన్వయం లోపించినట్లు చెబుతున్నారు. దీంతో, తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణ కార్యకర్తగా పని చేస్తున్న శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రిని చేయటంతో పార్టీ కేడర్ లో సానుకూలత వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో, పార్టీ అధ్యక్షుడిగానూ అదే తరహాలో ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం జగను సొంత నియోజకవర్గానికి చెందిన నేత పేరు ప్రచారంలో ఉంది. మరి.. బీజేపీ నాయకత్వం తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications