టీడీపీ నియోజకవర్గాల్లో బీజేపీ కొత్త ఫిట్టింగ్ - సీనియర్ల సీట్ల మార్పు..!?

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. అందులో 6 ఎంపీ అభ్యర్దులను బీజేపీ ప్రకటించింది. తొలుత ఇచ్చిన విజయనగరం స్థానం కాదని రాజంపేట నుంచి తమ అభ్యర్దిని ప్రకటించింది. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాల్లోనూ కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చింది. తమకు అదనంగా మరో సీటు ఇవ్వాలని కోరుతోంది. స్థానాల విషయంలో కొత్త ప్రతిపాదనలతో..టీడీపీ సీనియర్లలో టెన్షన్ మొదలైంది.

సీట్ల సర్దుబాటు
బీజేపీ కొత్త డిమాండ్ తో కూటమిలో సీట్ల సర్దుబాటులో అనేక మార్పులు మొదలయ్యాయి. మూడు పార్టీల కూటమిలో బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు అంగీకరించారు. జనసేనకు 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. కాగా, జనసేన ఇప్పటి వరకు అధికారికంగా 18 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్దులను ఖరారు చేసింది. బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్దులను ప్రకటించింది. 10 అసెంబ్లీ స్థానాల పైన నిర్ణయం జరిగిన తరువాత, ఇప్పుడు తమకు మరో సీటు కేటాయించాలని బీజేపీ ప్రతిపాదన తీసుకొచ్చింది. పది అసెంబ్లీ నియోకవర్గాల్లో అభ్యర్దులు ఖయమయ్యారని చెబుతున్నా..అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. బీజేపీ కోరుతున్న మార్పులతో టీడీపీ సీనియర్ల సీట్లలో కొత్త లెక్కలు మొదలయ్యాయి.

BJP Demands 11th seat as alliance with TDP and Janasena will Chandra Babu agree

11వ స్థానం ఇవ్వాలంటూ
బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ అరుణ్ సింగ్ నేతృత్వంలో పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ పదకొండు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. రాజంపేట లేదా తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఒక దాన్ని కేటాయించాలని కోరుతున్నారు. బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు కోసం తొలుత రాజమండ్రి ఎంపీ పరిధిలోని అనపర్తి స్థానం పైన చర్చ జరిగింది. అయితే, అక్కడ నుంచి పోటీ చేసేందుకు వీర్రాజు విముఖత వ్యక్తం చేసారు. దీంతో..ఇప్పుడు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని తాజాగా ప్రతిపాదన పెట్టారు. రాజమండ్రి సిటీ బీసీ వర్గాలకు టీడీపీ కేటాయింపు చేయటంతో మార్పు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చంద్రబాబు నిర్ణయం ఏంటి
దీంతో, ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పైన బీజేపీ ఆసక్తిగా ఉంది. అక్కడ ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి పోటీలో ఉన్నారు. తొలుత ఈ సీటు జనసేనకు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున నిరసన మొదలైంది. చివరకు ఈ సీటు బుచ్యయ్యకే కేటాయించారు. ఈ సీటు ఆశించిన కందుల దుర్గేష్ కు నిడుదవోలు ఖరారు చేసారు. రాజమండ్రి రూరల్ తమకు ఇవ్వటం ద్వారా. తాము రాజమండ్రి ఎంపీ సీటు గెలిచేందుకు వీలుగా ఉంటుందనేది బీజేపీ వాదన. దీని పైన చంద్రబాబు నిర్ణయం కీలకంగా మారనుంది. అదే సమయంలో రాజంపేట లేదా తంబళ్లపల్లె లో ఒక సీటు 11వ స్థానం గా ఇవ్వాలనే తాజా ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. దీంతో..బీజేపీ తుది జాబితా ఇప్పుడు టీడీపీ సీనియర్లలో ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+