ఏపీలో ఆ లోక్సభ స్థానాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ!!

కేంద్రంలోని బిజెపి వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోందా? ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాలపై బిజెపి ఫోకస్ చేస్తుందా? తాజాగా బీజేపీ అగ్రనేతల పర్యటనల ఆంతర్యం అదేనా? ఇటీవల పర్యటనకు వచ్చిన అమిత్ షా ఈమేరకు దిశా నిర్దేశం చేశారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

తాజాగా విశాఖలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించిన బిజెపి అధినాయకత్వం అభ్యర్థులను ఖరారు చేయడం కోసం విజయావకాశాలు ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగాల్సిన అభ్యర్థుల ఎంపికలో భాగంగా కొందరి ప్రొఫైల్స్ ను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం.

BJP

రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే, వీటిలో కనీసం ఐదు స్థానాల్లో ఘనవిజయం దక్కించుకోవడం కోసం బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ఐదు స్థానాల్లో అయినా గెలవాలని పార్టీ నేతలకు సూచించిన అమిత్ షా అందులో భాగంగానే ఇటీవల విశాఖలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ అవకాశాలు ఉన్న విశాఖపట్నం, రాజంపేట, విజయనగరం, అనకాపల్లి, గుంటూరులపై ప్రధానంగా ఫోకస్ చేయాలని బీజేపీ అగ్ర నాయకులు సూచించారని తెలుస్తోంది.

రానున్న పార్లమెంటు ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేసి కొన్ని పార్లమెంటు స్థానాలను అయినా కైవసం చేసుకోవాలని అమిత్ షా భావిస్తున్నారు. అందుకే ఇటీవల పర్యటనలో గతంలో బీజేపీ బలోపేతంగా ఉన్న స్థానాలను గుర్తించి, మళ్లీ అక్కడ జెండా పాతడానికి ఏం చేయాలి అన్న దానిపై అమిత్ షా చర్చించినట్లు తెలుస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారడం పైన కూడా చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం పార్టీలో ఉన్న కీలక నాయకులలో లోక్ సభకు బరిలోకి దిగే వారు ఎవరు అన్న దానిపై అమిత్ షా అధ్యయనం చేస్తున్నారు. అంగబలం, అర్ధ బలం ఉన్న నాయకులైతేనే విజయావకాశాలు ఉంటాయని ఆయన భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+