కూటమి పై పట్టు బిగిస్తున్న బీజేపీ - కీలక పరిణామాలు..!!
ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు వేళ కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ కూటమి లో పట్టు బిగుస్తోంది. తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తమ పార్టీకి ప్రాతినిధ్యం పెరిగేలా మిత్రపక్షాల పైన పంతం నెగ్గించుకుంటోంది. ఢిల్లీ నేతల జోక్యంతో చంద్రబాబు, పవన్ బీజేపీ నేతల డిమాండ్లకు ఆమోదం తెలుపుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ సీట్ల విషయంలోనూ ఆసక్తికర సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. దీంతో, చివరి నిమిషంలో నిర్ణయాలు మారినట్లు తెలుస్తోంది.
బీజేపీ పట్టు
ఏపీలో మూడు పార్టీల కూటమి లో బీజేపీ ప్రాధాన్యత పెరుగుతోంది. కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజ్యసభ సీట్ల విషయం లో తమకే ప్రాధాన్యత కావాలని ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకత్వం కూటమి మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది. ఆర్ క్రిష్ణయ్య రాజీనామా.. తిరిగి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైసీపీ నేత సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటు సైతం బీజేపీకి దక్కనుంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ నేతలు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. రాజ్యసభ సీటు బీజేపీకి ఇస్తుండటంతో.. ఎమ్మెల్సీ సీట్ల కోసం టీడీపీలో ఉన్న పోటీ కారణంగా జనసేనకు మాత్రమే ఒక సీటు ఇవ్వాలని టీడీపీ తొలుత భావించింది.

ఢిల్లీ నేతల ఎంట్రీతో
అయితే, ఎమ్మెల్సీ సీట్ల కోసం బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిడి.. మారుతున్న లెక్కలతో డిప్యూటీ సీఎం పవన్ అప్రమత్తం అయ్యారు. కూటమి సభ్యుల ఖరారు వరకు వేచి చూడకుండా నాగబాబు తో నామినేషన్ దాఖలు చేయించారు. మిగిలిన నాలుగు సీట్లు టీడీపీకే దక్కుతాయని ఆశావాహులు అంచనా వేసారు. చివరి నిమిషం వరకు తమ వంతు ప్రయత్నాలు చేసారు. బీజేపీ తమకు సీటు కేటాయించాలని పట్టు బట్టింది. ప్రస్తుతం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. తదుపరి కేటాయింపుల్లో అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయినా, బీజేపీ నేతలు పట్టు బట్టి చివరి నిమిషంలో తమకు ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారు. దీంతో, టీడీపీ మూడు స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
బీజేపీ ఎమ్మెల్సీగా
ఇక.. బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.అభ్యర్థి ఎంపికపై ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కసరత్తు చేసారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు మాజీ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర బీజేపీ నేత మాధవ్ పేర్లు ప్రము ఖంగా వినిపిస్తున్నాయి. పురందేశ్వరి ఇదే అంశం పైన కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంప్రదిం పులు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన మరో ఇద్దరు నేతల పేర్లు తెర మీదకు వచ్చాయి. కాగా, మహిళకు అవకాశం పైన ఢిల్లీ నేతలు ఆరా తీసినట్లు సమా చారం. దీంతో.. బీజేపీ పట్ట బట్టి మరీ సాధించుకున్న ఎమ్మెల్సీ సీటు వ్యవహారం ఇప్పుడు కూటమిలో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications