టీడీపీ పొత్తుల వ్యవహారం పై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎవరితో కలుస్తారు. టీడీపీ - జనసేన పొత్తు ఉంటుందా. బీజేపీ స్టాండ్ ఏంటి. ఇప్పుడు రాజకీయంగా ఇదే చర్చ కొనసాగుతోంది. ప్రధానితో పవన్ వైఖరిలో మార్పు వచ్చిందని.. టీడీపీతో పొత్తు ఉండే అవకాశాలు తక్కువంటూ ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో చంద్రబాబు అందిరనీ కలుపుకొని వస్తాము అంటూ సభల్లో చెబుతున్నారు. బీజేపీ మాత్రం తమ పొత్తు పవన్ తోనే ఉంటుంది.. టీడీపీతో ఛాన్స్ లేదని తేల్చి చెబుతోంది. ఈ వాదనల నడమ ఏపీలో పొత్తు వ్యవహారం రాజకీయంగా వేడి పెంచుతోంది.
ఇతరుల సాయం తీసుకోమన్న అయ్యన్న
ఇదే సమయంలో టీడీపీ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీరాముడు బలవంతుడే అయినా రావణ సంహారం కోసం ఇతరుల సాయం తీసుకున్నాడంటూ చెప్పుకొచ్చారు. లోక కల్యాణం కోసమే ఆంజనేయుడు, విభీషణుడు, ఉడత సాయం కూడా తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేసారు. దీని ద్వారా టీడీపీ బలంగానే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూనే..ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని సూచించారు. అదే సమయంలో తాను గెలవనని భావిస్తే తనకు టికెట్ ఇవ్వద్దని పార్టీ అధినేతకు సూచించారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
దీని పైన ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. అయ్యన్న వ్యాఖ్యల పైన ట్వీట్ చేసారు. అందులో " భగవంతుడయిన శ్రీరాముడితో తమ నాయకుడు చంద్రబాబుతో పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కళ్యాణం కోసం కాదు. "లోకేష్"కళ్యాణార్థం అని అందరికీ తెలుసు.." అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ఇతర పార్టీలతో పొత్తు కోసం పరితపిస్తూ..అంటూ బీజేపీ నేత చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చకు కారణమైంది.
పొత్తులపై రాని స్పష్టత
టీడీపీలోనూ కొందరు సీనియర్ల మధ్య ఇదే చర్చ జరుగుతోంది. ఇతర పార్టీలతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయనే అభిప్రాయం అంతర్గత చర్చల్లో సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. అటు జనసేన భవిష్యత్ లో బీజేపీతో ఉంటుందా..లేక టీడీపీతో కొనసాగుతుందా అనే అంశం పైన ఎటువంటి క్లారిటీ ఇవ్వటం లేదు. ప్రస్తుతానికి బీజేపీతో ఉన్నామనే అంశాన్ని మాత్రమే పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, ఈ పొత్తుల అంశం తేలే వరకు రెండు పార్టీల్లోని టికెట్ల ఆశావాహుల్లో ఉత్కంఠ తప్పేలా లేదు. బీజేపీ నేత జీవీఎల్ చేసిన ఈ ట్వీట్ పైన టీడీపీ నేతలు స్పందిస్తారా లేదా చూడాలి.
భగవంతుడయిన శ్రీరాముడితో తమ నాయకుడు @ncbnతో పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కళ్యాణం కోసం కాదు. "లోకేష్"కళ్యాణార్థం అని అందరికీ తెలుసు.
— GVL Narasimha Rao (@GVLNRAO) November 20, 2022
-
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications