Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీలోనే కన్నా - రంగంలోకి ఢిల్లీ పెద్దలు: పవన్ తో ఫైనల్ గా..!?

టీడీపీ-జనసేన పొత్తు వేల బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. కన్నా పార్టీ మార్పు ఆలోచనలకు బ్రేకులు వేస్తోంది.

ఏపీ రాజకీయాలపైన బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. పార్టీ నేతలు ఏపీకీ వస్తున్నారు. తమతో పొత్తులో ఉన్న జనసేన..టీడీపీకి దగ్గరవుతున్న పరిణామాలను సీరియస్ గా తీసుకుంది. పార్టీలో ఏం జరుగుతుందో ఆరా తీస్తోంది. పార్టీ సీనియర్ నేత కన్నాకు జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రకాష్ జీ ఫోన్ చేసారు. పార్టీ లో పరిణామాల పై చర్చించారు. అదే సమయంలో పవన్ తాను బీజేపీతోనే ఉన్నానని చెప్పటం..అటు టీడీపీతో పొత్తు సంకేతాల పైన అధినాయకత్వం నేరుగా తేల్చుకోవాలని భావిస్తోంది. పవన్ ఫైనల్ డెసిషన్ ఆధారంగా ఏపీలో కొత్త కార్యాచరణకు సిద్దం అవుతోంది.

బీజేపీ సీనియర్ నేత..రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు బిజెపి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రకాష్ జీ ఫోన్ చేసారు. ఏపీలో రాజకీయాలతో పాటుగా జనసేన - టీడీపీ పొత్తు పైన కన్నా నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఏపీ బీజేపీ పరిణామాలపైన ఆరా తీసారు. అదే సమయంలో కన్నా పార్టీ మార్పు వ్యవహారం పైన తెలుసుకొనే ప్రయత్నం చేసారు. అయితే, కన్నా తాను పార్టీ మారుతున్నానంటూ ఓ వర్గం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని శివ ప్రకాశ్ కు వివరించారు. రేపు విజయవాడలో భేటీ కావాలని శివ ప్రకాష్ జీ - కన్నా నిర్ణయించారు. ఆ భేటీలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటుగా సోము వీర్రాజు వ్యవహార శైలి పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీ - జనసేన పొత్తు భవిష్యత్ పైన చర్చించే ఛాన్స్ ఉంది.

BJP High command intervenes amid the news that Kanna laxminarayana would switch to Janasena, whats Pawans next step

ఇదే సమయంలో పవన్ బీజేపీ పైన తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. తాము బీజేపీతో పొత్తులోనే ఉన్నామని స్పష్టం చేసారు. బీజేపీ వద్దనుకుంటే ఒంటరిగా వెళ్తామని.. లేదంటే ఎవరితో అయినా పొత్తుతో వెళ్తామని చెప్పుకొచ్చారు. బీజేపీతో కొనసాగుతున్న సమయంలో మరో ఆప్షన్ గురించి పవన్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు.. టీడీపీతో పొత్తు ఆలోచన లేకపోతే ఇప్పటి వరకు ఆ ప్రచారాన్ని ఎక్కడా ఎందుకు ఖండించలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం పైన నేరుగా పవన్ తోనే చర్చించి.. జనసేనాని చెప్పే నిర్ణయం ఆధారంగా ఏపీలో పార్టీకి కొత్త కార్యచరణ అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ నేతలు అధినాయకత్వం సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో, రానున్న రోజుల్లో బీజేపీ ఏపీ కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+