ఏపీ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా-ర్యాలీలతో బీజేపీ హంగామా-సోము వీర్రాజు సుడిగాలి టూర్లు
దేశం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న వేళ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ పంద్రాగస్టున హర్ ఘర్ తిరంగా వేడుకలు చేపట్టారు. కేంద్రం ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ వేడుకల కోసం ప్రజల్ని సన్నద్ధం చేసేందుకు బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా అన్ని నగరాలు, పట్టణాల్ని, గ్రామాల్నీ చుట్టేస్తున్నారు.

ఏపీలో బీజేపీ హర్ ఘర్ తిరంగా
కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ జనాన్ని జాగృతం చేసే పనిలో పడ్డారు. బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన సూచనలతో పార్టీకి చెందిన నేతలంతా క్షేత్రస్దాయిలో కనిపిస్తున్నారు. వాడవాడలా జాతీయ పతాకాన్ని తిప్పుతూ అమృతోత్సవాల ప్రత్యేకతను వివరిస్తూ కనిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఏకకాలంలో నాలుగు జోన్లలో
రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఒక వైపు తిరంగా ర్యాలీలు చేపడుతుండగా.. ఆ పార్టీ యువజన విభాగం బీజేవైఎం యువ సంఘర్షణ యాత్రలు నిర్వహిస్తోంది. అజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ రెండింటినీ ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా నిర్వహిస్తునే మరో వైపు ముందుగా నిర్ణయించిన బిజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువసంఘర్షణ యాత్ర రాష్ట్రంలోని నాలుగు జోన్లలో ఏక కాలంలో చేపట్టారు. ఇందులో భాగంగా బీజేపా రాష్ట్ర శాఖ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యువసంఘర్షణ యాత్రను తిరుపతిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రారంభించారు. అదే విధంగా తిరంగా ర్యాలీలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని పిలుపు నిచ్చారు.
Recommended Video


రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ హంగామా
విజయవాడ, విశాఖ నగరాల్లో నిర్వహించిన తిరంగా ర్యాలీల్లో సోమువీర్రాజు స్వయంగా పాల్గొన్నారు. ఇవాళ కర్నూలులో నిర్వహించిన అజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జాతీయ నాయకుల విగ్రహాల వద్ద స్వచ్చభారత్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలులో స్వామి వివేకానంద విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, మాజీ ఎంపి టిజి వెంకటేష్, రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమాల్లొ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రశివన్నారాయణ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని బిట్ర స్వచ్చ భారత్ నిర్వహించారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పలు జిల్లాల్లో రాజ్యసభ ఎంపీ జివీఎల్ నరశింహరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, విశాఖలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications