చంద్రబాబుకు "పరీక్ష" పెడుతున్న పవన్ - ఢిల్లీ రాజకీయం..!!
ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైన వేళ పవన్ పట్టు బిగిస్తున్నారు. ఎన్డీఏ సమావేశానికి హాజరు తరువాత పవన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సీట్లు ఖరారు పైన ఫోకస్ చేసారు. అటు టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ ఇంకా తేల్చటం లేదు. అటు పార్లమెంట్ లో కీలక బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు తీసుకుంటోంది. బీజేపీ, పవన్ తీరు ఇప్పుడు చంద్రబాబుకు పరీక్షగా మారుతోంది.
పవన్ లో పెరిగిన విశ్వాసం:వారాహి యాత్రకు వచ్చిన స్పందనతో పవన్ లో విశ్వాసం పెరిగింది. అటు టీడీపీతో పొత్తు పైన సందేహం లేకపోయినా.. పొత్తు ఖరారు సమయానికి తన పట్టు తగ్గకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజేపీ - టీడీపీ మధ్య సయోధ్య దిశగానూ పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయంగా 2024 ఎన్నికలు తన పార్టీ భవిష్యత్ కు.. తన ప్రతిష్ఠకు కీలకమని పవన్ భావిస్తున్నారు. దీంతో, టీడీపీతో సీట్ల విషయంలో ముందుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీలో టెన్షన్ కు కారణమవుతోంది. అందునా టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో పవన్ తన అభ్యర్ధులను ఖరారు చేస్తుండటం టీడీపీకి సమస్యగా మారుతోంది.

వరుసగా అభ్యర్దుల ఖరారు:తాజాగా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు. సీటు మనదే..గెలుపు మనదే అంటూ చేసిన కామెంట్స్ టీడీపీ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. అక్కడ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి తానే పోటీ చేస్తానంటూ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇక, పవన్ తన వారాహి యాత్ర సమయంలో మూడు నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను ప్రకటించారు. వాటిలో పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు ఉన్నాయి. అయితే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కనీసం మూడు సార్లు ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచిన సీనియర్ నేతలు తిరిగి పోటీకి సిద్దం అవుతున్నారు. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
అంతుచిక్కని రాజకీయం:పవన్ కల్యాన్ వారాహి యాత్ర ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అదే సమయంలో ఏరి కోరిన సీట్లలో తన పార్టీ ఇంఛార్జ్ లను గతం కంటే భిన్నంగా నియామకాలు ప్రారంభించారు. టీడీపీ, జనసేన పొత్తు ఖయమని భావిస్తున్న సమయంలో ఈ నిర్ణయాలు టీడీపీ సీనియర్లకు అంతు చిక్కటం లేదు. అందరూ అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ నుంచి 20 -25 సీట్లు వరకు తీసుకోవటానికి సిద్దంగా లేరని.. తన బలం చాటుకుంటూనే సీట్లను పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇక, బీజేపీ కూడా కలిస్తే దాదాపు సీట్ల వరకు పొత్తుల్లో వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు టీడీపీ సీనియర్లను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో, ఎన్నికల వేళ క్షేత్ర స్థాయిలో పొత్తులు మేలు చేస్తాయా..వికటిస్తాయా అనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications