తప్పేంటి.. జవాబివ్వండి: జగన్‌కు బీజేపీ మద్దతు, ఇరుకునపడ్డ బాబు

స్విస్ ఛాలెంజ్ విధానంపై భారతీయ జనతా పార్టీ చంద్రబాబు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది.

నెల్లూరు: స్విస్ ఛాలెంజ్ విధానంపై భారతీయ జనతా పార్టీ చంద్రబాబు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందే అన్నారు. స్విస్ ఛాలెంజ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికే సరైన సమాచారం, అవగాహన లేదని ఆరోపించారు.

జగన్ అడిగిన దాంట్లో తప్పేమీ లేదని, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం విడ్డూరమన్నారు. పాలనలో పొరపాట్లు, తప్పులను ఎత్తి చూపే హక్కు ప్రతిపక్ష నేతకు ఉందన్నారు.

జగన్ ప్రశ్నలకు స్పందించాలి.. బీజేపీ

జగన్ ప్రశ్నలకు స్పందించాలి.. బీజేపీ

అలాగే, ప్రభుత్వం కూడా జగన్ ప్రశ్నలకు స్పందించాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకుపోవాలని ఆయన హితవు పలికారు.

ఏపీ పైన ప్రణాళికలు

ఏపీ పైన ప్రణాళికలు

ఆయన ఇంకా మాట్లాడుతూ... ఏపీలో బీజేపీలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. ఇందుకు కేంద్ర పార్టీ అధినాయకత్వం ప్రణాళిక వేస్తోందని ఆంజనేయ రెడ్డి చెప్పారు.

దక్షిణాదిపై కన్ను

దక్షిణాదిపై కన్ను

ఉత్తరాది రాష్ట్రాలలో బలమైన శక్తిగా ఎదిగిన పార్టీని దక్షిణాది రాష్ట్రాలలో విజయంపరంపరలో నడిపేంచేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చర్యలు తీసుకుంటున్నారని ఆంజనేయ రెడ్డి తెలిపారు.

మోడీపై విశ్వాసంతో..

మోడీపై విశ్వాసంతో..

ప్రధాని నరేంద్ర మోడీపై విశ్వాసంతో ప్రజలు బీజేపీకి పట్టంకడుతున్నారని తెలిపారు. ఈ నెల 25న పార్టీ అమిత్ షా విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారన్నారు.

బూత్ కమిటీలతో అమిత్ షా ముఖాముఖి సమావేశం ఉంటుందని తెలిపారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు రూ.5వేలు అదనంగా చెల్లించడంతో పాటు రవాణా ఇతర ఖర్చులను కేంద్రం చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+