'పవన్ కు సూటి ప్రశ్న? అధ్యయనం చేయకుండా మాట్లాడితే ఎలా?'
తిరుపతి : ప్యాకేజీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2.25లక్షల కోట్లను పాచిపోయిన లడ్డూలంటూ పవన్ పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా ఇదే విషయంపై తిరుపతిలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి.. ప్యాకేజీ వివరాలపై ఎలాంటి అధ్యయనం చేయకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని పవన్ కు సూచించారు.

కేంద్రం ప్రకటించిన 2.25లక్షల కోట్ల ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలా కనిపిస్తుందా? అంటూ పవన్ కు ఇదే తన సూటి ప్రశ్న అన్నారు భానుప్రకాష్ రెడ్డి. కేంద్రంలో ఉన్న బీజేపీ సొంత బలంతోనే గెలిచిందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సమగ్ర ప్రణాళికా నివేదికల ఆధారంగానే కేంద్రం నుంచి నిధులు మంజూరు అవుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications