జనం జగన్ వైపే.. బీజేపీ నేత సంచలనం
సినీ నటి, తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె ఏపీ రాజకీయాల గురించి తనదైనశైలిలో స్పందించారు. ముక్కుసూటిగా చెప్పడం మాధవీలత స్టైల్. ఒకొనొక సమయంలో సొంత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఏ విషయమైనా నిర్మోహమాటంగా చెబుతుంటుంది. తాజాగా ఆమె ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నారని తెలిసినప్పటికీ ..ఆమె వైసీపీకి మద్దతుగా మాట్లాడి సంచలనం సృష్టించింది.
జనం జగన్ వైపే - బీజేపీ నాయకురాలు మాధవీ లత..!#MaadhaviLatha #MadhaviLatha #YSJaganAgain#YSRCPCandidates #VoteForFan #ElectionCommission #BJP #TDPJanasena #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/W5PNytolvt
— oneindiatelugu (@oneindiatelugu) March 16, 2024
ఎంతమంది కలిసి వచ్చినా కచ్చితంగా ఏపీకి మళ్లీ జగనే సీఎం అవుతారంటూ బల్ల గుద్ధి చెప్పారు. ఈ మేరకు తన అఫిషియల్ ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను షేర్ చేశారామె. ఈ వీడియోలో మాధవీలత మాట్లాడుతూ...' ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. అయితే 'పొత్తు పెట్టుకున్నాం.. సులభంగా గెలిచేద్దాం.. జగన్‌ని సాగనంపుదాం' అంటే మాత్రం అంత సులభం కాదని మాధవీలత తేల్చేసింది. జగన్ దగ్గర బలమైన రాజకీయ ప్రణాళికలు ఉన్నాయని మాధవీలత చెప్పుకొచ్చింది.

పేద ప్రజలకు ఆయన పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించారు. కాబట్టి మళ్లీ జగనే గెలిచే అవకాశం ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఓడించాలంటే పార్టీలు ఎంతో కష్టపడాలి. మూడు పార్టీలు చేతుల కలిపినంత మాత్రాన విజయం సాధ్యం కాదు. కార్యకర్తలు కూడా సమష్ఠిగా కృషి చేయాలి. సమష్ఠిగా కష్టపడితేనే కూటమికి విజయం సాధ్యమవుతుంది. లేదంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి' అని తన వీడియోలో చెప్పుకొచ్చింది. బీజేపీ నాయకురాలిగా ఉన్న మాధవీలత వైసీపీకి మద్దతుగా మాట్లాడడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగనే మళ్లీ సీఎం అవుతారని చెప్పిన మాధవీలత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications