జేసీ తీవ్ర వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన బీజేపీ నేత మాధవీలత!

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఓన్లీ లేడీస్ పార్టీ పైన మాధవీలత చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రచ్చ కొనసాగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బిజెపి అన్నట్టు ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. డిసెంబర్ 31న పార్టీ ఏర్పాటు చేసిన జెసి కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానించారు. ఈ ఓన్లీ లేడీస్ పార్టీ పైన నటి బిజెపి నేత మాధవి లత స్పందించారు.

మాధవీలత వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి
ఓన్లీ లేడీస్ పార్టీకి వెళ్ళొద్దని ఆమె మహిళలకు అప్పీల్ చేశారు. వేడుక నిర్వహించే ప్రాంతంలో గంజాయి సేవించే వాళ్ళు ఎక్కువగా ఉంటారని, మహిళలకు ఆ ప్లేసు సేఫ్ ప్లేస్ కాదని మాధవి లత ఒక వీడియోలో చెప్పారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాధవి లత ను ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP leader Madhavi latha gives a strong response to JC prabhakar reddy harsh comments

మాధవీలతపై కేసు నమోదు
అసలు బిజెపిలో ఆమెను ఎందుకు తీసుకున్నారో తెలియదని, ఆమె పెద్ద వేస్ట్ కాండిడేట్ అంటూ కామెంట్ చేశారు. మాధవి లత వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళలను అవమానించేలా మాధవి లత మాట్లాడారని జెసి పార్క్ లో ఎటువంటి సంఘటనలు జరగడం లేదని ఆయన అన్నారు. అంతేకాదు మాధవి లత పై జేసీ అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టిడిపి మహిళా కౌన్సిలర్లు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు.

బిజెపి కంటే జగనే నయం అంటూ జేసీ వ్యాఖ్యలు, భగ్గుమన్న బీజేపీ
దీంతో మాధవీలతపై కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత అనూహ్యంగా నిన్న తెల్లవారుజామున జెసి బస్సులు దగ్ధం కావడంతో ఇది బిజెపి నాయకుల పనేనని జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి కంటే జగనే నయం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన పైన తాను ఫిర్యాదు చేయనని, పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇక జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల పైన బీజేపీ నేతలు సైతం భగ్గుమంటున్నారు.

జేసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాధవీ లత
తాజాగా జెసి ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల పైన సినీనటి, బిజెపి నేత మాధవి లత స్పందించారు. ఆ వయసు అయిపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు.. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం అంటూ పేర్కొన్నారు. నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు. మహిళల మాన ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను అంటూ మాధవి లత వెల్లడించారు. ఒంటరిగానైనా పోరాడతానన్నారు.

సినిమాల్లో ఉండే వాళ్ళంతా ప్రాస్టిట్యూట్ లా? మాధవీలత ఫైర్
సినిమాలలో ఉన్న వాళ్లంతా ప్రాస్టిట్యూట్లని ఆయన చెప్పారు కాబట్టి ఆ జిల్లా నుంచి ఎవరు ఇండస్ట్రీకి రావద్దు అంటూ మాధవి లత సూచించారు. మహిళలు సురక్షితంగా ఉండాలని చెప్పడమే తాను చేసిన తప్పా అంటూ ఆమె ప్రశ్నించారు. తాడిపత్రిలో ఉండే వాళ్ళు మాత్రమే మహిళలా... మిగిలిన వాళ్ళు అంత బజారు వాళ్ళ అంటూ జెసి ప్రభాకర్ రెడ్డి పైన ఎదురుదాడికి దిగారు. వయసులో పెద్దవారైనా ఆయన గౌరవప్రదమైన మాటలు మాట్లాడాలని, అసభ్య పదాలు వాడడం దారుణమని మండిపడ్డారు. ఆయన భాషను బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలుస్తుంది అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+