ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్ది గా - మోదీ మార్క్ ఎంపిక, కొత్త లెక్కలు..!!
బీజేపీ ఏపీ కేంద్రంగా కొత్త లెక్కలు మొదలు పెట్టింది. పార్లమెంట్ రెండో విడతలో జమిలి.. నియోజక వర్గాల పునర్విభజన బిల్లులు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో అయిదు రాష్ట్రాల ల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర కేబినెట్ విస్తరణకు సమాయత్తం అవుతోంది. కాగా.. ప్రస్తుతం ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలతో పాటుగా త్వరలో మరిన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ కు తమ అభ్యర్ధిగా ఊహించని నిర్ణయంతో సిద్దం అవుతున్నట్లు సమాచారం.
ఏపీ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకోనుంది. రాజ్యసభ సభ్యుల విషయంలో బీజేపీ తొలి నుంచి కూటమిలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది. అందుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ కోటాలో ఇద్దరు బీజేపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆర్ క్రిష్ణయ్య, పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సీట్లు కేటాయించింది. కాగా.. త్వరలో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. త్వరలోనే ఈ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే టీడీపీకి రెండు, బీజేపీ, జనసేన లకు చెరొక స్థానం తీసుకునేలా నిర్ణయం జరిగింది. టీడీపీ నుంచి సానా సతీష్ కు మరొకసారి పదవిని రెన్యువల్ చేయనున్నారు. రెండో స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుంది. అయితే, బీజేపీ మాత్రం జాతీయ స్థాయి లెక్కల ఆధారంగా ప్రతీ సీటు విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

బీజేపీ నాయకత్వం వ్యూహాత్మక ఎంపిక
ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ కోటాలో మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లు ప్రయత్నాలు చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు కూడా గతంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఉండి పదవీ విరమణ చేశారు. జీవీఎల్ గత ఎన్నికల్లో విశాఖపట్నం టిక్కెట్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా అది టీడీపీకి వెళ్లింది. దీంతో జీవీఎల్ నరసింహారావు పేరు కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది. అయితే, సామాజిక వర్గాల లెక్కల్లో కిరణ్ కుమార్ రెడ్డి పేరు రేసులోకి వచ్చిందని చెబుతున్నారు. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో SC వర్గీకరణ చట్టం అమలు అయిన నేపథ్యంలో మంద కృష్ణ మాదిగకు ఆ స్థానం దక్కనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు BJP నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంద కృష్ణ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సీటు ఖరారు పైన అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications