ఆ సీట్లు మావే, బీజేపీ కొత్త ఫిట్టింగ్: టీడీపీ-జనసేనకు జలక్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఏపీలో ఎదిగేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. చేరికల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర స్థాయిలో చేరికల సంఖ్య పెరగాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చే నేతల జాయినింగ్స్ పై బీజేపీ నాయకత్వం కూటమిలోని మిత్రపక్షాలకు స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు ఇదే కూటమిలో ఆసక్తి కర సమీకరణాలకు కారణం అవుతోంది.
బీజేపీ తాజా నిర్ణయం
ఏపీలో కూటమి గా కొనసాగుతూనే మూడు పార్టీలు తమ భవిష్యత్ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ తమ పార్టీ ఏపీలో బలం పెంచుకునేందుకు ఇదే సరైన సమయం గా భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేస్తోంది. పార్టీలో చేరికల పైనా క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీ నుంచి వచ్చే వారు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తే ఆహ్వానించాల ని నిర్ణయించింది. అదే సమయంలో కూటమిలోని మిగిలిన పార్టీల్లో చేరికల పైనా అభ్యంతరాలు చెప్పవద్దని స్పష్టం చేసింది. దీని పైన టీడీపీ, జనసేనకు అభ్యంతరం లేకపోయినా.. మరో నిర్ణయం మాత్రం అంతు చిక్కటం లేదు.

ఆ స్థానాలు మావే
వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కొందరితో కూటమి పార్టీలు టచ్ లో ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి మోపిదేవి, ఆర్ క్రిష్ణయ్య, బీదా మస్తాన రావు రాజీనామా చేయగా.. ఆ స్థానాలు భర్తీ చేసారు. ఆ ముగ్గురూ కూటమి పార్టీల్లో చేరారు. కాగా, మూడు పార్టీలకు తొలుత ఒక్కో సీటు చొప్పున చర్చలు జరిగినా.. చివరకు పవన్ పార్టీకి సీటు లేకుండా టీడీపీకి రెండు, బీజేపీ ఒక సీటు దక్కేలా నిర్ణయం అమలైంది. తాజాగా సాయిరెడ్డి రాజ్యసభకు చేసిన రాజీనామా ఆమోదం పొందింది. ఈ సీటు బీజేపీ తమ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ, జనసేనకు స్పష్టత ఇచ్చింది. అదే విధంగా వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో తాము టచ్ లో ఉన్న నేతల రాజీనామా చేస్తే ఆ స్థానాలు తమ పార్టీకే దక్కుతాయని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
తేల్చి చెప్పిన బీజేపీ
వైసీపీ నుంచి త్వరలో మరో ఇద్దరు.. చర్చలు ఫలిస్తే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారేలా ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. ఈ ముగ్గురు సభ్యులను తమ పార్టీలోనే చేర్చుకునేలా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. లోక్ సభలో టీడీపీ సభ్యుల మద్దతు ఎన్డీఏకు కీలకంగా ఉండటంతో.. రాజ్యసభలో మాత్రం తమ బలం పెంచుకోవాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్సీ స్థానాల్లో తాము ఒత్తిడి చేయబోమని.. రాజ్యసభ సీట్లలో మాత్రం రాజీ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో, వైసీపీకి తమ నేతలు టీడీపీ -జనసేనలోకి కాకుండా బీజేపీలోకి వెళ్లటం ఆ పార్టీకి ఎంతో కొంత కలిసొచ్చే అంశంగా విశ్లేషణలు మొదలయ్యాయి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications