టిడిపితో పొత్తు: 9-25 బిజెపి లెక్క! పవన్‌తో టచ్‌లో..
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో పొత్తులపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం త్రిసభ్య కమిటీని వేసింది. తొ్మిది లోకసభ, 30 అసెంబ్లీ నియోజకవర్గాలు టిడిపిని అడగాలని బిజెపి భావిస్తోంది. పొత్తు విషయమై బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ సీమాంధ్ర పార్టీ ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు.
సీమాంధ్రలో తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం బాగా ఉంటుందని బిజెపి భావిస్తోంది. అదే సమయంలో పదిహేనేళ్ల క్రితం ఎపిలో ఏడు లోకసభ స్థానాలను గెలుచుకున్న అంశాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మోడీ హవా నేపథ్యంలో కొన్ని సీట్లు అయినా గెలుస్తామని వారు భావిస్తున్నారు.

6 లోకసభ, 30 అసెంబ్లీ స్థానాలు అడిగేందుకు సిద్ధమైన బిజెపి.. 9 లోకసభ, 25 అసెంబ్లీ స్థానాల వరకు ఖరారు చేసుకోవాలని చూస్తోందని అంటున్నారు. విజయవాడ, విశాఖ లోకసభ స్థానాలపై చర్చ జరుగుతోంది. మోడీ ప్రభావం అధికంగా ఎంపీ సీట్ల పైనే ఉంటుందని భావిస్తున్నారు. విజయవాడ లేదా విశాఖల నుండి పురంధేశ్వరి, హరిబాబులు పోటీ చేసే అవకాశాలున్నాయి. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి లేదా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లే అవకాశాలున్నాయి.
పవన్‌తో టచ్‌లో సీమాంధ్ర బిజెపి నేత!
టిడిపి, బిజెపిల పొత్తు దాదాపు ఖాయమైపోయింది. టిడిపి, బిజెపి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కూడా మోడీతో భేటీ కోసం అపాయింట్‌మెంట్ తీసుకున్నారట. సీమాంధ్రకు చెందిన బిజెపి ముఖ్య నేత ఒకరు పవన్‌తో టచ్‌లో ఉన్నారట.












Click it and Unblock the Notifications