త్వరలో జగన్ కు చెక్? బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హింట్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డికీ మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. సందర్బంతో సంబంధం లేకుండా జగన్ పై విమర్శలు గుప్పించే నాయకుడిగా పేరున్న ఆదినారాయణరెడ్డి ఇవాళ మరోసారి రెచ్చిపోయారు. జగన్ కు తాము ఈసారి సూపర్ చెక్ పెట్టబోతున్నట్లు ఆదినారాయణరెడ్డి ఇవాళ హెచ్చరించారు. జగన్ భారతి రాజ్యాంగాన్ని జగన్ అమలుచేశాడన్నారు.
వివేకా హత్య కేసులో ఎంతోమంది పాత్ర ఉందని, అసలు దోషులు దాక్కున్నారని ఆదినారాయణరెడ్డి తెలిపారు. తాను, బీటెక్ రవి, సతీష్‌రెడ్డి కలిసి వివేకాను చంపామని అసత్య ప్రచారం చేశారన్నారు. లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఉందని, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన తెలిపారు. జగన్‌తో పాటు అనేకమంది జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జగన్ మాట్లాడే ప్రతి మాటకు తాను సమాధానం చెబుతానన్నారు. జగన్ ప్రజలతోనే కాదు, చెల్లెళ్లతో కూడా ఛీ కొట్టించుకున్నారన్నారు.

జగన్‌కు డబ్బులు, పదవి ఉంటే చాలు.. ధర్మం, న్యాయం అవసరం లేదని ఆదినారాయణరెడ్డి తెలిపారు. ధర్మ సంస్కృతి కూటమి ప్రభుత్వానిదని, ధర్మ వికృతి జగన్‌ది అని విమర్శించారు. జగన్ పేదల ఇళ్లు కట్టకుండా ప్యాలెస్‌లు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఇప్పటికే పులివెందుల ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టారని, స్ధానికంగా వైసీపీ బలం బాగా తగ్గిపోయిందన్నారు. రాష్ట్రంలోనూ ప్రజలు జగన్ ను ఛీకొట్టేరోజులు దగ్గర్లో ఉన్నాయని ఆది తెలిపారు.

మరోవైపు కేంద్రం పూర్ణోదయ ప్రాజెక్టు కింద ఏపీకి రూ.65వేల కోట్లు కేటాయిస్తోందని ఆదినారాయణరెడ్డి తెలిపారు. కేంద్రం ఈ పథకం కింద ఆరు రాష్ట్రాలకు నిధులు ఇస్తోందని, ఇందులో ఏపీ కూడా ఉందన్నారు. ఇందులో రాష్ట్రానికి నాలుగు ఎయిర్ పోర్టులు, నాలుగు పోర్టులు వస్తాయన్నారు. టిడ్కో ఇళ్లు కూడా మన రాష్ట్రానికే ఎక్కువగా కేటాయిస్తున్నారని ఆదినారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications