కొన్ని థియేటర్లే లక్ష్యంగా ఎందుకు?: ఎమ్మెల్సీ మాధవ్, ముగ్గురు హీరోలపై కక్ష అంటూ సోమిరెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత అంశం రాజకీయ దుమారం రేపుతోంది. అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

కొన్ని థియేటర్ల లక్ష్యంగా దాడులా?: ఎమ్మెల్సీ మాధవ్
తాజాగా, విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాధవ్ మాట్లాడుతూ.. సినిమా రంగం విషయంలో ఏపీ ప్రభుత్వానిది అనవసర జోక్యమన్నారు. ప్రభుత్వం కొన్ని థియేటర్లనే ఎందుకు లక్ష్యంగా చేసుకుందని నిలదీశారు. సానుకూల భావన లేదని సినిమా రంగంపై దాడులా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ మాధవ్. ప్రభుత్వ వైఖరితో సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులనూ బెదరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 28న ప్రజాగ్రహ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వ బాధితులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ముగ్గురు హీరోలపై కక్షతో సినీ పరిశ్రమను నాశనం చేస్తారా?: సోమిరెడ్డి
సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో ప్రయోజనం చేశామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. అదే పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోందన్న విషయాన్ని గమనించడం లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినిమా పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో 125 థియేటర్లు మూతపడ్డాయని, కక్ష సాధింపులకూ కక్ష సాధింపులకూ అడ్డు ఉంటుందని సోమిరెడ్డి అన్నారు. సూళ్ళూరుపేటో అతిపెద్ద థియేటర్ ను మూసివేశారని చెప్పారు. సినిమా థియేటర్లలో గంజాయి ఏమైనా ఉందా? అని నిలదీశారు. రాత్రి వెళ్లి దాడులు చేసి మూసివేసే హక్కు ఎవరిచ్చారని సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రశ్నించారు. తెలంగాణలో రైతుబంధు కింద రూ. 10వేలు ఇస్తున్నారని, పథకాలతో పోటీ పడాలని సూచించారు. ఏపీ ప్రభుత్వానికి చేతనైతే నిత్యావసర వస్తువులు, ఇసుక ధరలు తగ్గించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై నట్టికుమార్ మండిపాటు
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సినీ నిర్మాత నట్టి కుమార్ అసహనం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల చిన్న సినిమాలకు అన్యాయం జరగడంతోపాటు మల్టీప్లెక్స్ లో సినిమాను చూడాలనుకునే సామాన్యుడి కల అని.. అది కలగానే మిగిలిపోతుందన్నారు. చిన్న సినిమాలు లాభపడే విధంగా ప్రభుత్వం పది రోజుల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని లేదంటే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. టికెట్ల రేట్ల పెంపు విషయమై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనలు లేవన్నారు. కాగా, ఏపీలో సినిమా రేట్ల తగ్గింపును నట్టి కుమార్ సమర్థించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని అన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications