వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ను చూసి నేర్చుకోండి-వైసీపీ, టీడీపీకి బీజేపీ ట్వీట్-హెరిటేజ్ పాలు, భారతీసిమెంటేగా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ.. మరోవైపు టీడీపీకీ సమదూరం పాటిస్తోంది. అధికారిక సమావేశాల్లో మాత్రమే జగన్, చంద్రబాబును ఆహ్వానిస్తున్న కేంద్రం.. మిగతా విషయాల్లో మాత్రం రాజకీయంగానే ఆలోచిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా గుజరాత్ లో తమ పార్టీ సాధించిన గెలుపును గుర్తుచేస్తూ బీజేపీ ఇవాళ వైసీపీ, టీడీపీలకు ఓ ట్వీట్ పెట్టింది.

అభివృద్ధి ఎజెండాతో గుజరాత్ లో బిజెపి ఏడు సార్లు గెలిచిన ఫలితాలను చూసి ఏపీలో ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాలని ఈ ట్వీట్ లో వైసీపీ, టీడీపీని ఆ పార్టీ దెప్పి పొడిచింది. రాష్ట్రంలో 2024లో పంచడానికి ఏముంది హెరిటేజ్ పాలు, భారతి సిమెంట్ కంపెనీల ఆదాయం తప్ప అంటూ వ్యాఖ్యానించింది. ఏపీలో మరీ బరితెగించి నిన్న చంద్రబాబు వడ్డీతో సహా పాత సంక్షేమ పథకాలను అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఇస్తాము అని చెప్పడం తెదేపా పార్టీ దివాలాకోరు ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనమంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది.

 bjp mocks ysrcp,tdp with gujarat result in a tweet-mention heritage milk, bharati cement

అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారి మళ్లించి సీఎం @ysjagan రాష్ట్రాన్ని 90% నాశనం చేస్తే ,నేను 100% నాశనం చేస్తాను అని మాజీ సీఎం @ncbn చెప్పడం సిగ్గుచేటని ఏపీ బీజేపీ ట్వీట్లో మండిపడింది.


2024లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ వ్యాఖ్యానించింది. తద్వారా రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలకు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పకనే చెప్పింది. అంతే కాదు ఉచితాలను నమ్ముకుని రాష్ట్ర అభివృద్ధిని ఈ రెండు పార్టీలు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు పరోక్షంగా ఈ ట్వీట్ లో చెప్పారు.

English summary
ap bjp put a tweet with mocking ysrcp and tdp's freebies culture and ask to learn lesson from gujarat result.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X