ఎన్డీయేలోకి తెలుగుదేశం?... మేం చెబుతాం!!
తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయేలోకి తెలుగుదేశం పార్టీ వస్తోందన్న ప్రచారంపై మీడియా ప్రతినిధులు లక్ష్మణ్‌ను ప్రశ్నించారు.
Recommended Video
అది ప్రచారమేనని, అలాంటిదేమైనా ఉంటే మీడియాకు తెలియజేస్తామన్నారు. ఏపీలో సీఎం జగన్ పట్ల వ్యక్తమవుతోన్న ప్రజావ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా మలచుకుంటామని, దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

బీహార్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, నితీష్‌కుమార్ మధ్య జరిగిన సమావేశం.. పచ్చి అవకాశవాదుల సమావేశమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇంట గెలవడం చేతకాక బయటకు వెళ్లి రచ్చ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మజ్లిస్‌తోపాటు కాంగ్రెస్ పార్టీతోను ఆయన జతకట్టే అవకాశం కనపడుతోందని వ్యాక్యానించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ రెండూ ఒకే తరహా విధానాలతో ఎన్నికలకు వెళుతున్నాయని, అదే విధానాలతో కొనసాగుతున్న కుటుంబ పార్టీలని మండిపడ్డారు. మనుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోందని, దీన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించారని, దీన్ని ఆయన సహించలేకపోతున్నారంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications