Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిని నిర్వీర్యం చేసేలా జగన్ కుట్ర‌లు.. అభివృద్ధి కోసం ఏనాడైనా కేంద్రాన్ని అడిగావా? : జీవీఎల్ ఫైర్‌

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అసంపూర్తిగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆరోపించారు. ముందస్తు కార్యాచరణ లేకుండా 26 జిల్లాల పునర్విభజన చేస్తూ హడావుడిగా జగన్ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని దుయ్యబట్టారు. ఎలాంటి వసతులు, సదుపాయాలు కల్పించకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు. నిధులు లేకుండా కొత్త జిల్లాల్లో విధులు నిర్వహించడం ఎలా సాధ్యం అవుతుందవని ప్రశ్నించారు.

అప్పులతోనే జగన్ పాలన

అప్పులతోనే జగన్ పాలన

రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పులు పాలు చేశారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులతోనే పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కొత్త జిల్లాలో పరిపాలనను గాడిలో పెట్టాలంటే తక్షణం సుమారు రూ.200 కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. రాజధాని అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చెయ్యొద్దని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో .. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు కూడా అలాగే ఉందని విమర్శించారు. ఒక్కో జిల్లాకు కనీసం రూ 100 కోట్ల నిధులను ఎందుకు కేటాయించలేదని సీఎం జగన్ ను నిలదీశారు.

 జిల్లాలకు, మండల కేంద్రాలకు పొంతన లేదు..

జిల్లాలకు, మండల కేంద్రాలకు పొంతన లేదు..

ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే జిల్లాల పరిస్థితి నిర్వీర్యంగా తయ్యారవుతుందని జీవీఎల్ పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లా కేంద్రం, మండల కేంద్రాలకు అసలు పొంతన లేదని ఆరోపించారు. జిల్లాలు, డివిజన్ల విభజన శాస్త్రీయ బద్ధంగా లేదని విమర్శించారు. జిల్లా, మండల కేంద్రాలకు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గత ప్రభుత్వం భూములు కేటాయించిందని గుర్తుచేశారు. వాటిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

 అభివృద్ధి కోసం ఏనాడైనా నిధులు అడిగావా.?

అభివృద్ధి కోసం ఏనాడైనా నిధులు అడిగావా.?


అమరావతి అభివృద్ధి కోసం సీఎం జగన్ ఏనాడైనా కేంద్రానికి లేఖ రాశారా ? అని జీవీఎల్ ప్రశ్నించారు. అమరావతికి మోదీ ప్రభుత్వం సహాకరించేందుకు సిద్దంగా ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వమే ముందుకు రావడం లేదని విమర్శించారు. రాజధాని అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజధాని రైతుల పోరాటానికి బీజేపీ అన్ని విధాల మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. రైతుల పట్ల ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+