వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరిబాబు రాజీనామా, బీజేపీ లెక్కలు: బాబుకు షాక్, తెరపైకి పురంధేశ్వరి? రేసులో వీరే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు రాజీనామా లేఖను పంపించారు. చాలా రోజులుగా అధ్యక్షుడిని మార్చాలనే అంశం బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హరిబాబు కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అధిష్టానం మార్పు నిర్ణయానికి ఆయన కూడా చాలాకాలంగా సానుకూలంగానే ఉన్నట్లుగా కనిపించింది.

Recommended Video

యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతం : హరిబాబు

దీనిపై బీజేపీ నేత శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ.. పార్టీ ఆలోచనలకు అనుగుణంగానే హరిబాబు రాజీనామా చేశారని చెప్పారు. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించవలసివస్తోందని చెప్పారు. దీనికి వెసులుబాటు కల్పిస్తూ రాజీనామా చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ కావడానికి ఇదే సమయం అన్నారు. మరోవైపు హరిబాబు రాజీనామా నేపథ్యంలో పలువిరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా: ఆకస్మిక నిర్ణయం చర్చఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా: ఆకస్మిక నిర్ణయం చర్చ

రేసులో వీరు... హఠాత్తుగా తెరపైకి ఎవరినైనా తెస్తారా?

రేసులో వీరు... హఠాత్తుగా తెరపైకి ఎవరినైనా తెస్తారా?

ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి, మహిళా నాయకురాలు పురంధేశ్వరి, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరికి అవకాశం దక్కుతుంది.. లేదంటే హఠాత్తుగా మరొకరిని తెరపైకి తీసుకు వస్తారా అనే చర్చ సాగుతోంది.

సామాజిక సమీకరణాలే కీలకం

సామాజిక సమీకరణాలే కీలకం

సామాజిక సమీకరణాలే ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీడీపీ అసంతృప్తులను చేరదీయడం, కాపు వర్గం, ఆయా ప్రాంతాల ప్రభావం, యువత.. ఇలా ఎన్నో లెక్కలు వేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనను ఢీకొనే నేపథ్యంలో ఎవరికి అవకాశమిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల ఏడాది కాబట్టి సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి.

అలా పురంధేశ్వరికి ఛాన్స్

అలా పురంధేశ్వరికి ఛాన్స్

తెలుగుదేశం పార్టీ అశంతృప్తులను చేరదీయాలన్నా, ఎన్టీఆర్ సానుభూతి ఓట్లు చీల్చాలన్నా, మరికొన్ని లెక్కలతో పురంధేశ్వరికి అవకాశమివ్వడం సరైనదని కొందరు భావిస్తున్నారు. ఆమెకు పదవి దక్కవచ్చునని అంటున్నారు. అంతేకాదు, ఆమె సమర్థులైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.

ఎవరికి ఛాన్స్

ఎవరికి ఛాన్స్


కాపు వర్గం, కోస్తాలో ప్రభావవంతమైన నేతగా కన్నా లక్ష్మీనారాయణకు పేరు ఉంది. దీంతో ఆయనకు కూడా పదవి దక్కే అవకాశాన్ని కొట్టి పారేయలేమని అంటున్నారు. లేదంటే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే మాత్రం ఎమ్మెల్సీ మాధవ్‌కు దక్కవచ్చునని అంటున్నారు. ఇక, పార్టీ విధేయులలో సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాల రావులు ఉన్నారు. ఎవరు అనేది ఒకటి రెండు రోజుల్లో నిర్ణయించనున్నారని చెబుతున్నారు.

హరిబాబు రాజీనామాలో రాజకీయ కోణం లేదు

హరిబాబు రాజీనామాలో రాజకీయ కోణం లేదు

హరిబాబు రాజీనామా సాంకేతికపరమైన అంశమని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన పదవీ కాలం పూర్తి అయినందునే పార్టీ నియమాలకు కట్టుబడి రాజీనామా చేశారన్నారు. ఆయన రాజీనామా వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు. ఆయన సమర్థవంతుడైన నాయకుడని, ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. గతంలోనూ పార్టీ పెద్దలతో హరిబాబుకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని ప్రస్తావించామని, ఆయన రాజీనామాతో విశాఖ రైల్వే జోన్‌కు ఎటువంటి ఢోకా ఉండదన్నారు. కచ్చితంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందన్నారు.

English summary
Senior BJP leader and Visakhapatnam MP K Hari Babu resigned from the post of state unit president on Tuesday. He sent his resignation letter to BJP national president Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X