ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చు!: టిడిపికి బిజెపి ఎంపీ హరిబాబు షాక్
విజయనగరం: విశాఖ పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు.. శనివారం నాటి విజయనగరం జిల్లా కొత్తవలస పర్యటన టిడిపి, బిజెపి నేతల మధ్య వివాదానికి దారి తీసింది. హరిబాబు పాల్గొన్న కార్యక్రమాల్లో స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు, ఎంపీపీ గైర్హాజరయ్యారు.
దీనిపై కొందరు ఎంపీ హరిబాబును అడిగారు. మీ పర్యటనకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని వారు హరిబాబు ఎదుట అసహనం వ్యక్తం చేశారు. దీంతో హరిబాబు... ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని, ఇష్టముంటే పాల్గొనండి లేదంటే వెళ్లిపోండన్నాడని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, హరిబాబు సమక్షంలో కొత్తవలస వర్తక సంఘం బిజెపిలో చేరింది. శనివారం మధ్యాహ్నం కొత్తవలస ఆర్కే ప్లాజాలో వర్తక సంఘం ప్రత్యేక సదస్సు నిర్వహించింది. సదస్సుకు హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బిజెపిని బలోపేతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తద్వారా పార్టీ బలేపోతానికి కృషి చేయాలన్నారు. వర్తక సంఘానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications