అమరావతిపై బీజేపీ జాతీయ నేత కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ రాజధాని పైన మరోసారి రాజకీయంగా చర్చ మొదలైంది. సుప్రీంకోర్టులో ఈ నెల 23న రాజధానుల కేసు విచారణకు రానుంది. సుప్రీం ఏం చెబుతుందనేది ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలోనే రాజధానికి సంబంధించి మంత్రులు..ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి హీటెక్కుతోంది. ఇదే సమయంలో విజయవాడ వేదికగా బీజేప నేత అమరావతికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది రాష్ట్ర అంశంగా తేల్చి చెప్పారు.
ఏపీ రాజధాని అంశం పై కేంద్ర మాజీ మంత్రి..రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల క్రితం తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణానికి అనుమతి ఇచ్చామని గుర్తు చేసారు. ఇప్పుడు అకస్మాత్తుగా విశాఖ తెర మీదకు వచ్చిందన్నారు. దీని ఎలా అర్దం చేసుకోవాలి..ఇది రాష్ట్ర సమస్యగా జవదేకర్ తేల్చి చెప్పారు. ఏ నగరాన్ని రాజధానిగా ఎంచుకోవాలనేది రాష్ట్ర ప్రజల నిర్ణయంగా చెప్పుకొచ్చారు. మోదీ ఎట్ ది రేట్ ఆఫ్ 20, డ్రీమ్ మీట్ డెలివరీ పుస్తకం గురించి వివరించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ సంప్రదాయాలను కాపాడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించటంలో ముందుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు.

ఏ రాష్ట్రమైన సంపదను సృష్టించుకోవాలని జవదేకర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, అభివృద్ధి జరిగితేనే ఆ రాష్ట్రమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. అలా కాకుండా, ఉన్న సంపదపై ఆధారపడి కాలం వెళ్లదీస్తే అప్పులే మిగులుతాయని చెప్పుకొచ్చారు. దాని నుండి బయటపడటం చాలా కష్టం అవుతుందని పేర్కొన్నారు. 2001 నుండి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 2013 వరకు, 2014 నుండి దేశ ప్రధానిగా రెండుసార్లు పనిచేశారని అన్నారు. ప్రధాని విజన్ కే ప్రజలు మొగ్గు చూపారాని గుర్తు చేసారు. మొత్తంగా 21 ఏళ్ల పాలనానుభవం గడించారన్నారు. ఈ నేపథ్యంలో 21 మంది రచయితలు రాసిన పుస్తకాన్ని అన్ని భాషల్లో అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. 2024 ఎన్నికల్లో దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని జవదేకర్ ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications