బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వమే ఏపీలో .. ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే సంవత్సరం జరుగనున్న ఏపీ ఎన్నికలలో అధికారాన్ని మళ్లీ హస్తగతం చేసుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటినుంచే దూకుడుగా పని చేస్తుంటే, వైసీపీని గద్దె దించాలని టిడిపి, జనసేన పొత్తుల రాజకీయాలకు తెర తీశాయి. ఇక ఈ రెండింటితో పాటు బీజేపీ కూడా చేరుతుందా లేదా అన్నది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు.
ఈ సమయంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వమే త్వరలో వస్తుందని ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చాలామంది నేతలు భేటీ అవుతారని, అమిత్ షా, చంద్రబాబు భేటీపై వారిరువురు నేతలే చెబితే బాగుంటుందని వ్యాఖ్యలు చేశారు.

ఇక పొత్తుల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పేర్కొన్న ఆయన ఈనెల 11వ తేదీన విశాఖలో రైల్వే గ్రౌండ్ లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాల పాలనలో బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలు అమిత్ షా బహిరంగ సభ వేదికగా వెల్లడిస్తారని పేర్కొన్నారు.రేపు తిరుపతిలో కూడా బహిరంగ సభ జరుగుతుందని, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో పాల్గొంటారని ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు.
విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు జనసేనకు ఆహ్వానం లేదని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. ఇప్పటికే స్వరం మార్చిన బిజెపి నేతలు చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, తాజాగా సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమే అన్న అనుమానాలకు ఊతమిస్తోంది. ఏది ఏమైనా ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications