వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా అయితేనే మేమొస్తాం, టిడిపి, బిజెపి డ్రామాలాడితే బోడిగుండే: నారాయణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఆమరావతి: ఏపీ రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో టిడిపి, బిజెపిలు డ్రామాలు ఆడితే బోడి గుండే మిగులుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం వద్దకు తాము వస్తామని నారాయణ చెప్పారు.ప్రత్యేక ప్యాకేజీ వంటి బిక్షాటన కోసం మాత్రం తాము ఢిల్లీకి రాబోమని నారాయణ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అరకొర నిధుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.రాష్ట్రానికి న్యాయం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఏపీ రాష్ట్రానికి న్యాయం చేసే విషయమై బిజెపి మాత్రం సక్రమంగా వ్యవహరించడం లేదని అన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి నామాత్రంగా నిధుల కేటాయింపు విషయమై ఏపీలో చర్చ సాగుతోంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

బోడిగుండే మిగులుతోంది

బోడిగుండే మిగులుతోంది

ఏపీకి జరిగిన అన్యాయంపై అఖిలపక్షంతో చర్చించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోవడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులివ్వాలని కేంద్రం వద్దకు వెళ్ళాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే తాము అఖిలపక్షంతో కలవబోమని నారాయణ చెప్పారు. ప్రత్యేక హోదాపై అయితేనే ఢిల్లీకి వస్తామన్నారు. ప్రత్యేక హోదా విషయమై టిడిపి, బిజెపిలు డ్రామాలు ఆడితే బోడి గుండే మిగులుతోందని నారాయణ ఘాటుగా విమర్శించారు.

పెనం నుండి పొయ్యిలోకి, బిజెపి నేతలు కేంద్రాన్ని నిలదీయాలి: బాబు షాకింగ్ కామెంట్స్పెనం నుండి పొయ్యిలోకి, బిజెపి నేతలు కేంద్రాన్ని నిలదీయాలి: బాబు షాకింగ్ కామెంట్స్

వెంట్రుకతో పోల్చి ఏపీ ప్రజలను బిజెపి నేతలు అవమానించారు

వెంట్రుకతో పోల్చి ఏపీ ప్రజలను బిజెపి నేతలు అవమానించారు

ఏపీ ప్రజలను వెంట్రుకతో పోల్చి బిజెపి నేతలు అవమానపర్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు.ఏపీకి న్యాయం జరిగేలా బిజెపి నేతలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ప్రజలను అవమానపర్చేలా మాట్లాడడం సరైంది కాదని నారాయణ చెప్పారు.

పవన్ ఎఫెక్ట్: దిగొచ్చిన కేంద్రం, ఫిబ్రవరి 23న, ఢిల్లీకి రావాలని ఆహ్వనంపవన్ ఎఫెక్ట్: దిగొచ్చిన కేంద్రం, ఫిబ్రవరి 23న, ఢిల్లీకి రావాలని ఆహ్వనం

తెలంగాణ నేతలు కూడ కలిసిరావాలి

తెలంగాణ నేతలు కూడ కలిసిరావాలి

ఏపీకే కాదు తెలంగాణకు కూడ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ నేతలు కూడ కేంద్రంపై పోరాటానికి ఏపీతో కలిసి రావాలని నారాయణ సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై మొదట అవిశ్వాస తీర్మానం పెట్టాల్సింది తెలుగుదేశం పార్టీయేనని ఈ సందర్భంగా నారాయణ అభిప్రాయపడ్డారు.కేంద్రంపై అవిశ్వాసం పెడితే తెలంగాణ ఎంపీలు కూడ కలిసి రావాలని కోరారు.

కాంగ్రెస్ రిటైల్ అవినీతి, బిజెపిది హోల్ సేల్ అవినీతి

కాంగ్రెస్ రిటైల్ అవినీతి, బిజెపిది హోల్ సేల్ అవినీతి

కాంగ్రెస్ పార్టీది రిటైల్ అవినీతి అయితే బీజేపీది హోల్ సేల్ అవినీతి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రజలకు అవినీతి లేని పాలన ఇస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి కాంగ్రెస్ దారిలోనే నడుస్తోందని నారాయణ ఆరోపించారు.

English summary
CPI leader Narayana has welcomed Chandrababu's opinion to discuss with all parties on 'Confidence' over BJP govt. Giving clarity, he said CPI will extend support to the only agenda of Special Status but not Special Package.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X